25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు | new offices open before 25th | Sakshi
Sakshi News home page

25 నాటికి కొత్త కార్యాలయాల బోర్డులు

Published Wed, Sep 14 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పాల్గొన్నారు.  మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌

  • జిల్లా పునర్విభజన సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
  • ఖమ్మం జెడ్పీసెంటర్‌: కొత్తగూడెం జిల్లాలోని నూతన కార్యాలయాల ఫోటోలను కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. కార్యాలయాల బోర్డులను కూడా ఈ నెల 25వ తేదీ సిద్ధం చేసుకోవాలన్నారు.జిల్లా పునర్విభజనపై ఆయన బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. నూతన కార్యాలయాల ఏర్పాటు, వాటి వైశాల్యం, సిబ్బంది వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఏవేని మరమ్మతులు అవసరమనుకుంటే సంబంధిత శాఖ ప్రధాన కార్యాలయానికి నివేదిక పంపాలన్నారు. ఏదైనా శాఖకు కార్యాలయ భవనం కేటాయించనట్టయితే ఆ ప్రక్రియను సంబంధిత అధికారులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కార్యాలయాల్లోని ప్రభుత్వ వాహనాలను మాత్రమే అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఇప్పటికే ప్రైవేట్‌ వాహనాల వివరాలను నివేదికల్లో పేర్కొన్నట్టయితే వెంటనే తొలగించాలన్నారు. కొత్త మండలాల డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకటించినందున సంబంధిత మండలాలకు సిబ్బందిని సర్దుబాటు చేయాల్సుంటుందన్నారు. ఆవివరాలను అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధానాధికారి కార్యాలయంలోగల ఫర్నిచర్‌ను, ఫైళ్ళను కూడా విభజించాల్సుందని అన్నారు. కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ విధానంపై వివిధ శాఖల అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా పునర్విభజన నివేదికల ప్రక్రియను ఈ నెల15వ తేదీలోగా పూర్తిచేయాలని చెప్పారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు, జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్, జిల్లాపరిషత్‌ సీఈఓ మారుపాక నాగేశ్, వివిధ శాఖల జిల్లా అధికారులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement