ఇంటర్‌ విద్య ఆర్‌ఐఓ, డీవీఈఓ పోస్టుల విలీనం | Inter education RIO, DVEO posts integrated | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్య ఆర్‌ఐఓ, డీవీఈఓ పోస్టుల విలీనం

Published Sun, Sep 18 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

Inter education RIO, DVEO posts integrated

  • ప్రతీ జిల్లాకు ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈఓ)
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో డీఐఈఓ కార్యాలయాలు
  • విద్యారణ్యపురి : జిల్లాలోని ఇంటర్‌ విద్య, జిల్లా వృత్తి విద్యాధికారి పోస్టులను విలీనం చేయబోతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పునర్విభజనతో వరంగల్, హన్మకొండ (వరంగల్‌ రూరల్‌), భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాలు ఏర్పాటుకు ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ విద్య ఆర్‌ఐవో, జిల్లా వృత్తివిద్యాధికారి (డీవీఈఓ) కార్యాలయాలు ఉన్నాయి. ఇంటర్‌ విద్య ఆర్‌ఐవో ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల పర్యవేక్షణతోపాటు పరీక్షలను నిర్వహించే బాధ్యత చూస్తున్నారు. డీవీఈవో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పర్యవేక్షిస్తున్నారు. వృత్తి విద్యాకోర్సులును కూడా నడిపిస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు కానున్నందున ఇక ఆ రెండు కార్యాలయాలు వేర్వేరుగా కాకుండా ఒకే కార్యాలయంగా విలీనం కాబోతున్నాయి. ఇక నూతన జిల్లాలో ఆ రెండు పోస్టులు కలిపి జిల్లా ఇంటర్మీడియెట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌(డీఐఈఓ) వ్యహరిస్తారు. దీంతో జిల్లాకో డీఐఈఓ ఉంటారు. ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో ఇంటర్‌ విద్య ఆర్‌ఐవో, డీవీఈవోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని సీనియర్‌ పిన్సిపాళ్లు ఇద్దరు బాధ్యతలను నిర్విర్తిస్తున్నారు. ఇందులో ఒకరిని ఒక జిల్లాకు మరొకరిని మరో జిల్లాకు డీఐఈవోలుగా బాధ్యతలు అప్పగిస్తే మిగతా రెండు జిల్లాలకు డీఐఈవోలుగా ఎవరిని నియమిస్తారనేది చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ నియమిస్తే మరో ఇద్దరి సీనియర్‌ ప్రిన్సిపాళ్లను డీఐఈవోలుగా నియమించాల్సి ఉంటుంది. లేదా ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ విద్య ఆర్‌ఐఓ, డీవీఈఓలకే అప్పగిస్తారని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్‌ విద్య ఆర్‌ఐఓ, డీవీఈఓలు పోస్టులు కలిపి 17 మంది పనిచేస్తున్నారు. ఇక 27 జిల్లాలు కానున్న నేపథ్యంలో వారిని సర్దుబాటు చేసినా అన్ని జిల్లాలకు సరిపోరు. ప్రస్తుతం ఉన్నవారినే సర్దుబాటు చేస్తారా లేదా వేరే సీనియర్‌ ప్రిన్సిపాల్స్‌క అవకాశం కల్పిస్తారానేది వేచి చూడాల్సిందే. జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ విద్య ఆర్‌ఐవో కార్యాలయంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌ఐవోగా విధులు నిర్వర్తిస్తుండగా అందులో ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్‌ అసిస్టెంట్, ఒక జూనియర్‌ అసిస్టెంట్‌ ఉన్నారు. దినసరి వేతన ఉద్యోగులుగా ఇద్దరు, మరో ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్‌ అటెండర్‌ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఇక హన్మకొండలోని జిల్లా వృత్తివిద్యా కార్యాలయంలో డీవీఈవో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ బాధ్యతలను నిర్వర్తిస్తుండగా ఒకరు çఅడ్మినిసే్ట్రటివ్‌ ఆఫీసర్‌ సూపరింటెండెంట్, ఒకరు సీనియర్‌ అసిస్టెంట్, మరొకరు జూనియర్‌ అసిస్టెంట్, అటెండర్‌ తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ఆర్‌ఐవో, డీవీఈఓ కార్యాలయాల ఉద్యోగులను కలిపి కొత్తగా ఏర్పాటు చేయబోయే నాలుగు జిల్లాలకు సర్దుబాటు చేసి ప్రతిపాదించారు. అయినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేయనున్న డీఐఈవో కార్యాలయంలో ఉద్యోగుల కొరత ఉంటుంది. నాలుగు జిల్లాల ఏర్పాటు చేయబోతున్నందున వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు ఉన్న ప్రభు్వత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాలలకు సంబం«ధించిన వివరాలను సైతం ఆయా జిల్లాల పరిధిలోకి వెళ్లేలా ఫైళ్ల విభజన కూడా చేస్తున్నారు. ఇక వరంగల్‌ జిల్లా ఇంటర్‌ విద్య ఆర్‌ఐవో కార్యాలయం హన్మకొండలోని సుబేదారిలోని అద్దెభవనంలో కొనసాగుతుండగా హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీవీఈవో కార్యాలయం ఉంది. ఇక రెండు పోస్టులు విలీనంతో ఇక వరంగల్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ (డీఐఈవో) కార్యాలయం అద్దెభవనంలో ఉండబోతుండగా, హన్మకొండకు పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. మిగతా జయశంకర్‌ (భూపాలపల్లి) జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో, మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని ఓ హాల్‌లో ఇంటర్‌ విద్య ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ కార్యాలయం ఉండేలా ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇక ఇంటర్‌ విద్య ఎడ్యుకేషన్‌ఆఫీసర్‌ జిల్లాకు ఒకరు ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్‌ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలను కూడా పర్యవేక్షిస్తారు. జిల్లాలో 44 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో వరంగల్‌ జిల్లాకు 14, హన్మకొండ జిల్లాలో 9, భూపాలపల్లి జిల్లాకు 8, మహబూబాబాద్‌ జిల్లాకు 8, యాదాద్రి జిల్లాకు 6, సిద్దిపేటకు 2 ప్రభుత్వ కళాశాలలు ఉండబోతున్నాయి. ఈమేరకు ప్రతిపాదించారు. ఇక ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో మహబూబాబాద్‌ జిల్లాకు ఒకటి, వరంగల్‌ జిల్లాలో ఆరు ఉండబోతున్నాయి. ఇక ప్రస్తుతం వరంగల్‌ జిల్లాలో 241 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో కొత్తగా ఏర్పాటు కాబోతున్న వరంగల్‌ జిల్లాకు 67, హన్మకొండకు 88, భూపాలపల్లి జిల్లాకు 17, మహబూబాబాద్‌ జిల్లాకు 41 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉండబోతున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement