సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ ఆఫీసులకు వచ్చే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కోవిడ్ తరువాత క్రమంగా వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికిన మేజర్ కంపెనీలన్నీ ఉద్యోగులకు ఆఫీసులకు రప్పించేందుకు నానా కష్టాలు పడుతున్నాయి.ఆ ఫీసు నుండే పని చేసేలా ఉద్యోగులనుప్రేరేపించేందుకు వారు కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నాయనిహెచ్‌ఆర్ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలో టీసీఎస్ ఉద్యోగులను ఆఫీసు నుంచి పనిచేసేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది.
ఉద్యోగులు ఆఫీసు నుండి పనిచేసే రోజులకు పాయింట్లను చేర్చనుంది. అప్రైజల్ సిస్టమ్‌లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పాయింట్‌లను అందించనుంది. ఈ మేరకు కంపెనీలోని మేనేజర్‌లు, టీమ్ లీడ్‌లకు ఈమెయిల్ పంపించినట్టు తెలుస్తోంది. టీమ్ మెంబర్‌లందరికీ ఈ క్రింది RTO (రిటర్న్ టు ఆఫీస్)కు వచ్చేలా చూడాలని కోరింది. తమ టీం సభ్యులు వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులకు రావాలని కోరుతోంది.
అయితే తాజా పరిణామంపై హెచ్‌ఆర్ నిపుణులు విభిన్నంగా స్పందించారు. ఒక ఉద్యోగి పనితీరు వారు ఆఫీసు నుండి పని చేస్తున్నా లేదా రిమోట్‌గా పని చేస్తున్నారా అనే దానితో సంబంధం లేకుండా వారు ఉత్పత్తి చేసే ఫలితాలపై మాత్రమే నిర్దారించుకోవాలని, ఆఫీసు నుండి పని చేసే ఉద్యోగులు ఉండవచ్చు కానీ వారి లక్ష్యాలను చేరుకోలేరు, కేవలం ఆఫీసుల నుండి పని చేసినవారికి మదింపు పాయింట్లు ఇవ్వడం అనేది వారి పనితీరును మెరుగు పర‍్చడంలో సహాయ పడదని సీఐఇఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సీఎండీ ఆదిత్య నారాయణ్ మిశ్రా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment