సాక్షి, అమరావతి/ చీమకుర్తి: తెలుగుదేశం పార్టీ శాడిస్టు సైకాలజీ ప్రదర్శిస్తోందని, ఆల్ పార్టీ మీటింగ్ అంటూ.. చేసిన ఒక వికృత మీటింగ్‌లో మరింతగా వారి శాడిజం బయట పడిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. ఆశ్లీల సామ్రాజ్యానికి బాబే చక్రవర్తి అన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. చంద్రబాబు హయాంలో మహిళాధికారులు పడ్డ ఇబ్బందులే ఇందుకు సాక్ష్యం అని స్పష్టం చేశారు.
పెడన, ఒంగోలులో మంగళవారం వారు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. ‘మహిళలకు సంబంధించి ఏపీలో ఎటువంటి సమస్యా లేదు. ఉన్న సమస్యంతా చంద్రబాబు, లోకేశ్‌తోనే. వారు పెట్టుకున్న మీడియా, సోషల్ మీడియాతోనే. ఎక్కడో ఓ వీడియోను వారే సృష్టించి.. ఆ వెంటనే న్యూడిటీ అంటూ వారే గగ్గోలు పెట్టి.. ఆ తర్వాత వారే డిబేట్స్ నిర్వహించి, వారే ప్రెస్‌మీట్లు పెట్టించి.. అనంతరం వారే ఏకంగా రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టారు. సిగ్గులేకపోతే సరి. టీడీపీ చర్యల వల్లే మహిళలు బాధితులుగా మారుతున్నారు’ అని మండిపడ్డారు. వారు ఇంకా ఏమన్నారంటే..
బాధితురాలు ఎవరు?
► ఏ బాధిత మహిళా వచ్చి తాను ఈ వ్యవహారంలో బాధితురాలిగా ఉన్నానని టీడీపీకి చెప్పిందో వారే వెల్లడించాలి. ఆ వీడియో లోకేష్ ప్రొడక్షన్ నుంచి మీడియాకు వెళ్లింది. దాని నిర్మాత చంద్రబాబు. డైరెక్షన్ అయ్యన్నపాత్రుడు. అదొక థర్డ్ పార్టీ రికార్డింగ్. అది ఒరిజినల్ వీడియో అయితే బాధిత మహిళ చెప్పాలి కదా! బాధిత మహిళకు రక్షణ లేదంటే ఆ రక్షణ మేం ఇస్తాం.
► అటువంటి వీడియోను సమాజం మీదకు వదలటం సిగ్గు, బుద్ధి, బాధ్యత ఉన్న ఏ పొలిటికల్ పార్టీ.. ఏ సోషల్ మీడియా చేస్తుంది? సిగ్గున్న ఏ మీడియా అయినా ఇటువంటి వీడియోలను సమాజం మీదకు వదులుతుందా? ఆ వీడియోను చూసి చంద్రబాబు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?
► ఎంపీ తప్పు చేసి ఉంటే శిక్ష ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కూడా అదే చెప్పారు. ఎంపీది తప్పు అని తేలితే కచ్చితంగా శిక్షించాలని ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించటం జరిగింది. పోలీసు శాఖ దర్యాప్తు చేస్తోంది.
బాబుకు సిగ్గు ఉంటే నూతిలో దూకేవాడు
► నిజంగా చంద్రబాబుకు సిగ్గుంటే తన హయాంలో జరిగిన కాల్ మనీ వ్యవహారానికి, వందల మంది మీద కాల్ మనీ అత్యాచారాలకు బాధ్యత వహించి ఏ నూతిలోనో దూకేవాడు. అటువంటిది ఆయనకు ఏదీ లేదు. అందుకే ఈ సిగ్గుమాలిన మూకనంతా రంగంలోకి దింపి.. మహిళా పక్షపాత ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు మాట్లాడిస్తున్నారు.
► బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడిపై టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు దారుణం. నారా లోకేష్ రాసలీలల గురించి ఎందుకు ప్రస్తావించరు? లోకేష్ స్విమ్మింగ్ పూల్‌లో మందు తాగుతూ ఒకరితో, సంకలో మరొకరితో కలిసి ఉన్న ఫొటోలపై టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు కేసీఆర్ ముందు మోకాళ్లపై కూర్చోవడం నిజం కాదా?
► మా సంక్షేమ పథకాల్లో ఒక అమ్మ ఒడి, ఒక ఆసరా, ఒక చేయూత వంటి పథకాలు మహిళలకు ఇస్తున్న ప్రభుత్వం మీద సంక్షేమం, అభివృద్ధిలో పోటీపడలేకే ఈ సిగ్గులేని వ్యవహారం చేస్తున్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఉంటే కూడా చర్యలు తప్పవు.
అశ్లీల సామ్రాజ్యానికి బాబే చక్రవర్తి
Published Wed, Aug 10 2022 4:40 AM | Last Updated on Wed, Aug 10 2022 4:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment