
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నేను నీ ఇంటికే వచ్చా.. మీ నాన్న పారిపోయాడు. మీ నాన్ననే ఉరికించాం.. నువ్వెంత. లోకేష్.. టైమ్, ప్లేస్ చెబితే నీ దగ్గరికే వస్తా.. పాదయాత్ర అంటే బౌన్సర్లను పెట్టుకుని చేయడం కాదు’’ అంటూ మంత్రి దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
‘‘గన్నవరం సభ.. ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పెట్టినట్లు ఉంది. లోకేష్ నోరు అదుపులో పెట్టుకో. పాదయాత్ర అంటే ఏంటో వైఎస్సార్, వైఎస్ జగన్‌ను చూసి నేర్చుకో. నడవలేని వృద్ధులు సైతం జగన్ పాదయాత్రకు వచ్చారు’’ అని మంత్రి పేర్కొన్నారు.
‘‘మీరు పాదయాత్రలు చేసినా.. వారాహి యాత్రలు చేసినా అధికారంలోకి రారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో, చంద్రబాబు కుప్పంలో ఒంటరిగా పోటీ చేయాలి’’ అంటూ మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.
చదవండి: ఆర్జీవీ థర్డ్ గ్రేడ్ అంటూ లోకేశ్ వ్యాఖ్యలు.. రివర్స్ కౌంటర్ ఇచ్చిన వర్మ
Comments
Please login to add a commentAdd a comment