ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: జోగి రమేష్‌ | Minister Jogi Ramesh Comments On Chandrababu And Nara Lokesh | Sakshi
Sakshi News home page

ఆస్తులపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా?: జోగి రమేష్‌

Published Sat, Oct 21 2023 2:36 PM | Last Updated on Sat, Oct 21 2023 4:09 PM

Minister Jogi Ramesh Comments On Chandrababu And Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి: చేతగాని చవట సన్నాసులందరూ ప్రభుత్వంపై విషం కక్కుతున్నారంటూ ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు.

చంద్రబాబు నిజాయితీపరుడంటూ కబుర్లు చెబుతున్నారు. ఆవు దూడ మీద, దూడ ఆవు మీద చెప్పినట్టు బాబు, లోకేశ్‌ ప్రవర్తన ఉంది. తన ఆస్తులపై సీబీఐ విచారణ కోరే దుమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ మంత్రి సవాల్‌ విసిరారు.

‘‘చంద్రబాబు అరెస్టును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఆయనకు ఎవరైనా మద్దతుగా నిలబడ్డారా?. చంద్రబాబు పెత్తందారుల వైపు నిలబడినందుకే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోయింది. సీఎం జగన్‌ పరిపాలన ఒక సువర్ణయుగంగా ఉందని ప్రజలే చెబుతున్నారు’’ అని మంత్రి జోగి రమేష్‌ పేర్కొన్నారు.
చదవండి: పవన్‌ కల్యాణ్‌ కొత్త ప్లాన్‌.. బీజేపీ లొంగుతుందా? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement