
సాక్షి, అమరావతి : ప్రచారం ఆర్భాటాలు తప్ప రాజధాని నిర్మాణానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిందేమీ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు ఎద్దేవా చేశారు. మతిలేని చర్యలతో చంద్రబాబు అమరావతిని భ్రమరావతి చేశారని వ్యాఖ్యానించారు. వందల ఎకరాలను బాబు తన బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. అసైన్డ్ భూముల ధరలు ఎందుకు తగ్గించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలను చంద్రబాబు నిలువునా ముంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులు, ఆలయ భూములు, శ్మశానాలను ఆక్రమించారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. రాజధానిపై చర్చ సందర్భంగా సుధాకర్‌బాబు అసెంబ్లీలో మంగళవారం మాట్లాడారు.