సాక్షి, అమరావతి : చంద్రబాబు రాజకీయ వ్యభిచారిలా మాట్లాడుతున్నాడని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ధ్వజమెత్తారు. అమరావతిలో టీడీపీ నేతల బాగోతాలు బయట పడుతుంటే చంద్రబాబుకు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తాడేపల్లిలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కోసం, తన కుటుంబం కోసం, ఎల్లో మీడియా కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే సుజనాచౌదరి సీఎం రమేశ్‌ను బీజేపీలోకి చంద్రబాబు పంపారని ఆరోపించారు. అన్ని ప్రాంతాల సమానంగా అభివృద్ధి చెందడం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తున్నారని తెలిపారు. (‘కియా మోటార్స్ తరలింపు వార్తలు అవాస్తవం’)
పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు,లోకేష్.. సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల బినామీల పేరుతో బాబు అమరావతిలో భూములు కొన్నారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నుంచి బైట పడలాని ప్రయత్నిస్తున్నాడని దుయ్యబట్టారు. కియా మోటర్స్ వెళ్లిపోతుందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు కియా ఎక్కడికి పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల మీద జరుగుతున్న ఐటీ దాడులు నుంచి దృష్టి మళ్లించేందుకు కియా వెళ్లిపోతుందని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. చంద్రబాబు నోటి వెంట ఒక్క మాట నిజం రాదని, బాబుది సిగ్గు లేని జన్మ అని మండిపడ్డారు. ప్రచార పిచ్చితోనే చంద్రబాబు చచ్చిపోతారని, కుక్కతోక వంకర సామేత జీవితమని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. (ఆ దమ్ము చంద్రబాబుకు ఉందా..?)
Comments
Please login to add a commentAdd a comment