సాక్షి, అమరావతి : ఇంటింటికీ ఫించన్లు దేశ చరిత్రలోనే విప్లవత్మాకమై మార్పు అని ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనా తీరును టీడీపీ నాయకులు జీర్జించుకోలేకపోతున్నారని, టీడీపీ నాయకుల తీరు అవినీతిమయం అని విమర్శించారు. ‘అమ్మ ఒడి’ కార్యక్రమంపై దుష్ప్రచారం చేయడం వారిలోని అవగాహన లోపాన్ని తెలియజేస్తుందన్నారు. ఫించన్లు కొంతమందికి నిలుపుదల చేయడం తాత్కాలికమేనని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్క అర్హుడికి మేలు జరుగుతుందన్నారు. సీఎం జగన్ సమర్థవంతమైన పరిపాలన వలన టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయన్నారు. (సీఎం జగన్ మహిళల పక్షపాతి: తానేటి వనిత)
మద్యం ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధానం కాదని, మద్యం అలవాటు మానిపించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. దశల వారిగా మద్య నిషేదానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బ్రాండ్లను ఏర్పాటు చేయడం లేదన్నారు. అదే విధంగా ప్రైవేటు పాఠశాల విద్యార్థుల కంటే మెరుగైన పౌష్టికాహారంతో మద్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ప్రశంసించారు. మూడు రాజధానుల వల్ల సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కియా మోటర్స్ పరిస్థితిపై ఆకంపెనీ యాజమాన్యం స్పష్టమైన వివరణ ఇచ్చిందని, దీంతో చంద్రబాబు చేసేది దృష్ప్రచారాలు అని ప్రజలకు అర్థమైందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జగరదని భరోసా ఇచ్చారు. (అందుకే దిశ చట్టం తీసుకువచ్చాం: సీఎం జగన్)
Comments
Please login to add a commentAdd a comment