సాక్షి, తాడేపల్లి: ఏపీకి రావాల్సిన ప్రతి హక్కును చంద్రబాబు సాధించాలని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు ఎందుకు ప్రశ్నించటం లేదంటూ నిలదీశారు.
‘‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేక హోదా అడిగారు. నితీశ్ కుమార్ బీహార్‌కు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదు?. తల్లికి వందనం ఎప్పుడు నుంచి అమలు చేస్తారో చెప్పాలి. రైతు భరోసా వెంటనే అమలు చేయాలి. పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళలకు ఇస్తామన్న రూ.1500 లు ఎప్పట్నుంచి ఇస్తారు?’’ అంటూ టీజేఆర్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment