సాక్షి, ప్రకాశం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైందన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోలీసుల ద్వారా ప్రతిపక్షంపై కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపించారు.
టీజేఆర్ సుధాకర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు రాజకీయ అపర మేధావి అని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంలో నిజంగా చంద్రబాబు మేధావే. అందుకే హామీలను అమలు చేయడం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం ఒకే ఒక్క హామీని నెరవేర్చింది. అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం. దీపం పథకంలో ఉచిత సిలిండర్ ఇస్తామని కూటమి నేతలు హామీ ఇవ్వలేదా? మరి ఇప్పుడు ఎందుకు డబ్బులు కట్టించుకుంటున్నారు.
హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు సహా కూటమి నేతలు మహిళలను మోసం చేస్తున్నారు. గతంలోనూ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇలాగే మహిళలను మోసం చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చంద్రబాబుకు మొన్నటి వరకు నందమూరి ఫ్యామిలీతో, పురంధేశ్వరితో సఖ్యత ఉందా?. చంద్రబాబు తీరు చూస్తుంటే గురివింద సామెత గుర్తుకు వస్తుంది’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment