సాక్షి, తాడేపల్లి: ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతామన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. బాధత్యలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్‌తో అనుబంధ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బూత్ లెవల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని వైఎస్ జగన్ చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ అవుతాం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభుత్వంపై మేము పోరాటం చేస్తాం.
బాధ్యతలేని ప్రభుత్వ తీరుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దేశంలో ఏ పార్టీకి లేనంతగా పార్టీ నిర్మాణం చేస్తాం. ప్రజలకు అండగా నిలబడతాం. అన్ని స్థాయిల్లోనూ కార్యవర్గాలను నియమిస్తాం. అందరికీ ఐడీ కార్డులు కూడా ఇస్తాం. ఎవరెవరు ఎలా పని చేస్తున్నదీ సమీక్షలు చేస్తాం. చెదిరిపోయిన వాలంటీర్లను సమీకరిస్తాం. ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో పని చేస్తాం. 2029లో మళ్ళీ వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటాం. కమిటీ నిర్మాణాల అనంతరం సభ్యత్వ నమోదు ప్రారంభిస్తాం. ఈనెల 16, 17న వర్క్‌షాప్ నిర్వహిస్తాం. జిల్లా అధ్యక్షులతో కలిసి అన్ని విభాగాల నేతలు ఈ వర్క్‌షాపునకు హాజరవుతారు’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్..
Comments
Please login to add a commentAdd a comment