సాక్షి, తాడేపల్లి : పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి అర్ధం కాదని, ఆయన వైఖరి నచ్చకే ప్రజలు రెండు చోట్లా ఓడించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గుర్తు చేశారు. జనసేన పార్టీ కార్యాలయానికి భూమి ఇచ్చిన లింగమనేని భూములకు రేట్లు పడిపోతాయనే పవన్ ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి పరుడు, దొంగ అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిస్తుంటే ఏపీ బీజేపీ నాయకులు మాత్రం చంద్రబాబుకు అనుకూలంగా ధర్నాలు చేస్తున్నారని చురకలంటించారు.
చంద్రబాబు రాజకీయాలకు పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్ తోడయ్యాడరని విమర్శించారు. బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి పవన్ హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోతాడని ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాయలంలో బుధవారం సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్రం రూ.26 వేల కోట్ల రెవిన్యూ లోటులో ఉన్న మాట వాస్తవం కాదా. కొత్తగా రెండున్నర లక్షల కోట్లు అప్పు చంద్రబాబు తేలేదా.. లక్షల కోట్ల అప్పు తెచ్చి రాజధాని నిర్మాణానికి ఐదు వేల కోట్లు ఖర్చు చేయడం వాస్తవం కాదా. చంద్రబాబు మాయ మాటలు నమ్మి రైతులు మోసపోలేదా... పదేళ్ల ఉమ్మడి రాజధాని నుంచి పారిపోయి అమరావతికి రాలేదా’అని ప్రశ్నించారు.
‘సంక్షేమం అభివృద్ధిని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమపాళ్లలో అందిస్తున్నారు. అమరావతిలో ఎందుకు చంద్రబాబు సొంత ఇల్లు నిర్మించుకోలేదు. అమరావతికి వైఎస్ జగన్ వ్యతిరేకం కాకపోయినా ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ఘనత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిది. జనవరి 9వ తేదీ నుంచి అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ప్రతి తల్లికి రూ.15 వేలు అందిస్తాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందించాలనుకుంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ అడ్డుకున్నారు’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment