సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షనేత చంద్రబాబు మెప్పు కోసం వర్ల రామయ్య చాలా కష్టపడుతున్నాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సంక్షేమ పాలన అందిస్తున్నారని గుర్తు చేశారు. కరోనా వైరస్ కష్టకాలంలో కూడా టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. (టీడీపీ.. ఓ లిటిగెంట్ పార్టీ)
చంద్రబాబు డైరెక్షన్‌లోనే వర్ల రామయ్య లేఖలు రాశారని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. దళిత జాతిని అవమానించిన చంద్రబాబును వర్ల రామయ్య ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు వ్యాఖ్యలను దళిత జాతి ఎప్పటికీ మరిచిపోదన్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే అడ్డుకుంటారా అని తీవ్రంగా ప్రశ్నించారు. సీఎం జగన్ కేబినెట్‌లో దళితులకు పెద్దపీట వేశారని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment