సాక్షి, తాడేపల్లి : దళితులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కపట ప్రేమ చూపిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు విమర్శించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము విజయవాడ నడిబొడ్డున అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దళితులకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుపడ్డారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్న నాయకుడు సీఎం జగన్ అని సుధాకర్ ప్రశంసించారు. (‘టీడీపీకి మిగిలింది ఆ ఒక్కటే’)
Comments
Please login to add a commentAdd a comment