
సాక్షి, అమరావతి: చట్టసభలో టీడీపీ వైఖరిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు అన్నారు. మంగళవారం శాసనసభ సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును సమర్థించాల్సిన ప్రతిపక్షం.. అడ్డుకోవడం దారుణమన్నారు. సభ సజావుగా జరగకుండా టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై చర్చకు రాకుండా టీడీపీ యత్నిస్తుందని దుయ్యబట్టారు. గతంలో మహిళ, దిశ, బీసీ కమిషన్ బిల్లులపై కూడా టీడీపీ రాద్ధాంతం చేశాయని నిప్పులు చెరిగారు. దళితుల పట్ల టీడీపీ పట్ల వివక్షత చూపుతుందన్నారు. ‘దళితులకు రాజకీయాలు ఎందుకని చింతమని ప్రభాకర్ అనలేదా.. బాబు కేబినెట్‌లోని ఓ మంత్రి మాకు చదువు కోవటం రాదనలేదా’ అంటూ టీడీపీ నేతల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐదుగురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని సుధాకర్ బాబు పేర్కొన్నారు.
చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారు..
హైదరాబాద్ నుంచి సడన్‌గా అమరావతికి రావాల్సిన అవసరం ఏమిటని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహన్‌రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేంద్రం రాజధాని కట్టిస్తామని చెప్పినా చంద్రబాబు ఎందుకు తొందరపడ్డారని మండిపడ్డారు. కేంద్రం శివరామకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు సొంతంగా కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారని జగన్‌మోహన్‌రావు ప్రశ్నించారు.
ఎస్సీ,ఎస్టీలంతా జగన్ వెంటే..
ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. మాకు జగన్ లాంటి సీఎం కావాలని దేశంలో దళితులంతా కోరుకుంటున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారన్నాని ఆదిమూలం పేర్కొన్నారు.
చదవండి:
ఐదారు వేల కోట్లు ఎలా సరిపోతాయి?
సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment