సాక్షి, తాడేపల్లి: పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని.. అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు నిలదీశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చివేశారని.. వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవటం దారుణం అంటూ దుయ్యబట్టారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణంగా పెన్షన్లు అందించారు. 66,34,740 మందికి పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3,53,227 మందికి పెన్షన్లను తొలగించారు. ఇంకా తొలగించటానికి కమిటీలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను ఎన్నికల సమయంలో కుట్రతో ఆపించారు. చివరికి వందలాదిమంది పెన్షన్లనను తీసుకోవటానికి వెళ్ళి చనిపోవటానికి చంద్రబాబు కారణమయ్యారు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేసి వెరిఫికేషన్ చేయటం ఏంటి?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
‘‘మానసిక వికలాంగులు, దివ్యాంగులను చంద్రబాబు మానసికంగా అవమాన పరుస్తున్నారు. 112 బృందాలు పెన్షన్లను తొలగించటానికి జల్లెడ పడుతున్నారు. రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించినా న్యాయ పోరాటం చేస్తాం. అర్హత కల్గిన ఏ ఒక్క పెన్షన్ దారునికి ఇబ్బంది కలిగినా సదరు అధికారిపై కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు 2014-19లో కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108 అంబులెన్సులకు డీజిల్ కూడా కొట్టించలేదు. వైఎస్ జగన్ వచ్చాక అన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు’’ అని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment