Pension cuts
-
కూటమి సర్కారు 8 నెలల పాలనలో 1.90 లక్షల పింఛన్లు కట్
-
పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పెన్షన్‌దారులపై చంద్రబాబు కక్ష పెట్టుకున్నారని.. అందుకే పెన్షన్లను పెంచినట్టే పెంచి పూర్తిగా కోత పెట్టారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు నిలదీశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పెన్షన్ల పంపిణీని పూర్తిగా రాజకీయంగా మార్చివేశారని.. వీటన్నిటినీ జన్మభూమి కమిటీల ద్వారా పంపిణీ చేయాలనుకోవటం దారుణం అంటూ దుయ్యబట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రమాణంగా పెన్షన్లు అందించారు. 66,34,740 మందికి పెన్షన్లు అందించారు. కానీ చంద్రబాబు ఇప్పటికే 3,53,227 మందికి పెన్షన్లను తొలగించారు. ఇంకా తొలగించటానికి కమిటీలను ఏర్పాటు చేశారు. వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షన్లను ఎన్నికల సమయంలో కుట్రతో ఆపించారు. చివరికి వందలాదిమంది పెన్షన్లనను తీసుకోవటానికి వెళ్ళి చనిపోవటానికి చంద్రబాబు కారణమయ్యారు. ఇప్పుడు కొత్తగా కమిటీలు వేసి వెరిఫికేషన్ చేయటం ఏంటి?’’ అని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.ఇదీ చదవండి: బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల‘‘మానసిక వికలాంగులు, దివ్యాంగులను చంద్రబాబు మానసికంగా అవమాన పరుస్తున్నారు. 112 బృందాలు పెన్షన్లను తొలగించటానికి జల్లెడ పడుతున్నారు. రాజకీయ కోణంలో ఒక్క పెన్షన్ తొలగించినా న్యాయ పోరాటం చేస్తాం. అర్హత కల్గిన ఏ ఒక్క పెన్షన్ దారునికి ఇబ్బంది కలిగినా సదరు అధికారిపై కూడా కోర్టుకు వెళ్తాం. చంద్రబాబు 2014-19లో కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108 అంబులెన్సులకు డీజిల్ కూడా కొట్టించలేదు. వైఎస్ జగన్ వచ్చాక అన్నిటినీ సరిచేశారు. ఇప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీకి పూర్తిగా అన్యాయం చేస్తున్నారు’’ అని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. -
దివ్యాంగుల పెన్షన్ల కోత !
-
వృద్ధులపై కక్ష.. పింఛన్లు పీకేస్తున్న చంద్రబాబు
-
Big Question: కట్ కట్ కట్.. పింఛన్లు పీకేద్దాం..
-
ఏపీలో భారీగా ఫింఛన్ల తొలగింపునకు ప్రభుత్వం సన్నాహాలు
-
ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్
-
ప్రభుత్వ అజెండా దుర్మార్గం : వైఎస్ జగన్
హైదరాబాద్:పింఛన్లకు కోత విధించడం అమానుషం అని, ప్రభుత్వ అజెండా దుర్మార్గం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. పార్టీలకు అతీతంగా పేదల పక్షాన నిలవాలని ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్లు ఏరివేయడానికి ప్రభుత్వం తరపున జరుగుతున్న కుట్రలో భాగస్వాములు కావద్దని పెన్షనర్ల పరిశీలన కమిటీ అధ్యక్షునికి, సభ్యులకు ప్రతిపక్ష నేతగా విజ్ఞప్తి చేశారు. బహిరంగ లేఖ సారాంశం: 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గ్రామగ్రామాన తిరుగుతూ 200 రూపాయల పింఛను వెయ్యి రూపాయలు చేస్తానని, 500 రూపాయల పింఛనును 1250 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు చేస్తానని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పింఛనుదార్ల మీద కక్షకట్టినట్లు, పగబట్టినట్లు ప్రవర్తిస్తూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతన్నలూ, గీతన్నల పింఛను కత్తిరించే కార్యక్రమం ప్రారంభించింది. నిన్నటి వరకు పింఛన్లు అందుకున్నవారి పింఛన్‌ను తొలగిస్తే, వారు ఎలా బతుకుతారన్న ఆలోచన కూడా చంద్రబాబుకు లేదు.రాష్ట్రంలో 43,11,688 పింఛన్ల కోసం ఈ ఏడాది కనీసం 3600 కోట్ల రూపాయలు కావలసి ఉందగా, బడ్జెట్లో కేటాయించింది కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే. సామాజిక పెన్షన్ల పూర్తి వివరాలు: ఏపిలో ప్రస్తుతం 43,11,688 మంది పెన్షన్ తీసుకుంటున్నారు. వృద్ధుల పెన్షన్లు : 20,30,131 (ప్రస్తుతం రు.200- అక్టోబరు నుంచి రు.1000 ఇవ్వాలి) వితంతు పెన్షన్లు : 13,21,986 (ప్రస్తుతం రు.200- అక్టోబరు నుంచి రు.వి1000 ఇవ్వాలి) వికలాంగ పెన్షన్లు : 5,36,837 (ప్రస్తుతం రు.500 - అక్టోబరు నుంచి సగం మందికి రు.1000, మిగిలినవారికి రు.1500 ఇవ్వాలి) అభయహస్తం :2,87,897 (ప్రస్తుతం రు.500 - అక్టోబరు నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాలి) ఇతర కేటగిరి : 90వేలు (ప్రస్తుతం రు.200 - అక్టోబరు నుంచి వెయ్యి రూపాయలు ఇవ్వాలి) ఈ ఆర్థిక సంవత్సరంలో సామాజిక పింఛన్లకు కేటాయించవలసింది మొత్తం 3,730 కోట్ల రూపాయలు. కానీ బడ్జెట్లో కేటాయించింది కేవలం 1338 కోట్ల రూపాయలు మాత్రమే. లోటు (తేడా ) 2400 కోట్ల రూపాయలు. ఈ మేరకు పింఛన్లు కత్తిరించి, కొందరికి మాత్రమే పింఛన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా ఈ కత్తిరింపుల కార్యక్రమానికి సహకరించవద్దు. మానవతా దృక్పధంతో వ్యవహరించాలి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో పరిశీన పేరిట ఏడు లక్షల సామాజిక పెన్షన్లకు కోత పెట్టింది. వాస్తవానికి మరో 15 లక్షల మంది సామాజిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ అందించడానికి వీలుగా మహానేత శాచురేషన్ విధానాన్ని అవలంభించారు.17 లక్షల మందికి మాత్రమే ఇస్తున్న పెన్షన్లను వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అదనంగా మరో 55 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారు. పింఛన్‌ను 75 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. ఆధార్ కార్డు ఉపయోగించి రేషన్ ఇవ్వకుండా ఆపుతారా.. ఖబడ్దార్ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ పింఛన్లకూ ఆధార్‌ను ప్రాతిపదికగా మార్చి, రకరకాల ఆంక్షలు పెడుతూ అర్హుల పొట్టగొట్టేందుకు కత్తి దూస్తున్నారు. ఇంతకు మించిన దుర్మార్గం ఉందా? దుర్మార్గమైన, అమానుషమైన తొలగింపు కార్యక్రమానికి సహకరించవద్దని, అర్హులైన అందరినీ పింఛన్ల జాబితాలో చేర్చడానికి సహకరించాలని గ్రామ సర్పంచులు, మండలాధ్యక్షులు, మునిసిపల్ చైర్మన్లు, వార్డు మెంబర్లు, మునిసిపల్ కార్పోరేషన్ చైర్మన్లు, కార్పోరేటర్లకు, వారి నేతృత్వంలోని సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ** -
పండుటాకులపై సర్కారు వేటు
సాక్షి, ఒంగోలు: ఆసరా లేని పండుటాకుల నోట్లో మట్టి కొట్టడానికి సర్కారు సిద్ధమైంది. అర్హతల పరిశీలనల పేరుతో ఁనయ వంచన*కు ప్రభుత్వం తెరదీసింది. ప్రత్యేక కమిటీలంటూనే.. అందులో రాజకీయ నేతలను సభ్యులుగా చేర్చుతూ ఉత్తర్వులు జారీచేసింది. వచ్చేనెల (అక్టోబర్) రెండో తేదీ నుంచి ప్రారంభమయ్యే పింఛన్ల వారోత్సవాల్లో భాగంగా ముందస్తు చర్యలంటూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్ 135ను జారీచేసింది. పింఛన్ తీసుకుంటున్న వారి అర్హతల పరిశీలనతోపాటు ఆధార్‌కార్డుల సీడింగ్ ప్రక్రియ వివరాలతో సరిపోల్చేందుకు ఇంటింటికీ ప్రత్యేక కమిటీలను పంపనుంది. అసలే చాలీచాలని పింఛన్‌తో కష్టంగా నడుస్తున్న రోజుల్లోనే ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పెంచి ఆదుకున్నారు. ‘వంద’రోజుల కిందట అధికారంలోకొచ్చిన చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారి నోటికాడ ముద్దను లాగేసుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. సమగ్ర సర్వే పేరిట పింఛన్‌దారులపై రాజకీయ పెత్తనానికి ఒడిగడుతోంది. ఆర్థికపొదుపు పేరిట బహిరంగ ప్రకటనలిస్తూనే.. అనవసర వ్యవహారాలకు ఇష్టానుసారంగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం అభాగ్యుల మెడపై కత్తిదూస్తోంది. పాతబడ్జెట్ ప్రకారమే పింఛన్‌దారులకు అధికమొత్తాన్ని పంపిణీ చేయాలంటే... అందులో కొందరిని అనర్హులుగా ప్రకటించాలనే ఎత్తుగడకు అధికార పార్టీ నేతలు పూనుకుంటున్నారు. టీడీపీ వాగ్థానాల్లో భాగంగా పెంచుతామన్న పింఛన్లను అక్టోబర్ రెండో తేదీ నుంచి పంపిణీ చేయాలనే తలంపుతో కసరత్తు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 19, 20వ తేదీల్లో ఓ సమగ్ర సర్వే చేయాలని ప్రభుత్వ ఆదేశాలు బుధవారమే జిల్లాకేంద్రానికి అందాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు నేరుగా లబ్థిదారుల ఇళ్లకు రానున్నారు. ఇప్పటికే డీఆర్డీఏ కార్యాలయం నుంచి సేకరించిన లబ్ధిదారుల జాబితాలో పేర్కొన్న వివరాల ప్రకారం క్షేత్రస్థాయిలో సంబంధిత లబ్థిదారులు కనిపించకపోతే అక్కడిక్కడే అనర్హత వేటు వేయాలనేది జీవో సారాంశం. అంటే, ఈ పథకం ద్వారా తమ అనుయాయులకే లబ్ధిచేకూరేలా మలుచుకునేందుకు .. బినామీల ఏరివేత పేరిట జల్లెడ పడుతున్నారు. ఏరి వేత ఇలా...: గ్రామాలవారీగా సర్వే బృందాల ఏర్పాటుకు నిర్ణయించారు. సర్పంచి, ఎంపీటీసీ సభ్యుడు, పంచాయతీ కార్యదర్శితోపాటు ఇద్దరు సామాజిక కార్యకర్తలు, డ్వాక్రా సంఘాల సభ్యులతో గ్రామస్థాయిలో కమిటీలను నియమించాల్సి ఉంది. వీరు ఇంటింటికీ తిరిగి లబ్దిదారుల జాబితాలో వివరాలను తనిఖీ చేస్తారు. ఆ సమయంలో ఆచూకీలేకున్నా.. సమయానికి ఇంటిలో అందుబాటులో లేకున్నా, గ్రామం విడిచి వేరే ప్రాంతానికి వెళ్లినా, అనివార్య కారణాలతో తనిఖీ కమిటీ దృష్టిలో పడకున్నా.. వారి పింఛన్ తొలగిస్తారు. గ్రామస్థాయి కమిటీలిచ్చిన నివేదికలను మండలస్థాయి కమిటీ పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించనున్నారు. మండలస్థాయి కమిటీలో ఎంపీడీవో, ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు, ఇద్దరు సర్పంచులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, డ్వాక్రాసభ్యులు ఉంటారు. మున్సిపాల్టీ, కార్పొరేషన్లలో వార్డు కౌన్సిలర్ లేదా డివిజన్ కార్పొరేటర్‌తోపాటు బిల్‌కలెక్టర్, సామాజిక కార్యకర్తలు, డ్వాక్రాసభ్యులు ఉంటారు. జిల్లా కమిటీలో జిల్లా మంత్రితోపాటు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ సభ్యులుగాంటారు. కమిటీల నియామకంపై బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో వాటిలో సభ్యుల నియామకానికి గురువారం ఒక్కరోజే గడువుంది. 5.50 లక్షల మందిలో అయోమయం జిల్లాలో సుమారు 5.50 లక్షల మంది అర్బన్, రూరల్ ప్రాంతాల్లో వివిధ రకాల పింఛన్లు అందుకుంటున్నారు. వీరికి నెలకు సుమారు రూ. 18 కోట్లకు పైగా చెల్లిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన రూ.వెయ్యి పింఛన్ అందాలంటే, అదనంగా సుమారు రూ.40 కోట్లు పైచిలుకు అవసరమవుతోందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. దీంతో ఈ మొత్తాన్ని ఎంతవరకు తగ్గించాలనేది సమగ్ర సర్వేలో భాగమనే చెప్పాలి. గ్రామ, మండలస్థాయి కమిటీల్లో తమకు నచ్చని వారి పేర్లను తొలగించడం, కావాలనుకున్న పేర్లు చేర్చడం వంటి చర్యలకు అడ్డూ అదుపులేకుండా ఉంటుందని లబ్ధిదారులు ఆందోళనపడుతున్నారు.