సాక్షి,తాడేపల్లి : సాక్షి,తాడేపల్లి : నియంతలు,నీరోల పాలనకు చంద్రబాబు పాలనకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
- ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కును మన రాజ్యాంగం కల్పించింది
- పాలకులు రాచరికపు పోకడలు పోవటానికి వీల్లేదు
- కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారా?
- ప్రజల ప్రాథమిక హక్కులన్నిటినీ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు
- అలాంటి చంద్రబాబుకు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జరుపకునే హక్కు లేదు
- రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే చంద్రబాబుకు పాలనకు అనర్హుడు
- చెప్పినట్టు కేసులు పెట్టించకపోతే మంత్రి పదవిలో నుండి దిగిపోవాలని మంత్రి అనితని పవన్ కళ్యాణ్ అన్నారు
- ఇదేనా అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసే తీరు?
- నియంతలు, నీరోల పాలనకు చంద్రబాబు సర్కారుకు దగ్గరి పోలికలు ఉన్నాయి
- దళిత నేత నందిగం సురేష్ ను అన్యాయంగా జైలుపాల్జేశారు
- దళిత నాయకత్వాన్ని చంపేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నారు
- వైఎస్ జగన్ దళితులకు అందించిన సంక్షేమాన్ని నిలిపేసిన చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు
- చిన్నారులపై అత్యాచారాలు చేసి చంపేస్తుంటే చంద్రబాబు దోషులను ఎందుకు అరెస్టు చేయనీయటం లేదు?
- జగన్‌పై నిత్యం విషం చిమ్మటానికే చంద్రబాబు పని చేస్తున్నారు
- చంద్రబాబు గెలుపులో ఏదో తేడా ఉందని అందరికీ అర్థం అవుతోంది
- ఈవిఎంలలో తేడా వలనే గెలిచారని ప్రజలు అంటున్నారు
- భారీ సీట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తే భయమెందుకు?
- ఇలాంటి నాయకులను రీకాల్ చేసే పరిస్థితులు రావాలి
- ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104, ఇతర అనేక కార్యక్రమాలను ఆపేసిన చంద్రబాబుకు రాజ్యాంగాన్ని అమలు చేసే హక్కు లేదు
- ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబుకు రాజ్యాంగ దినోత్సవం జరుపుకునే హక్కు లేదు
- అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి
- ఇక్కడ ఈవీఎంలతో ఎందుకు జరుపుతున్నారు?
- రాజ్యాంగ పరిరక్షణకు అందరం నడుము బిగించాల్సిన సమయం వచ్చింది
- కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గబోము’ అని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment