
ఫైల్ ఫోటో
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. దళితులకు భరోసా, నమ్మకం, గౌరవం కల్పించారు. దళితుడైన నన్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది అన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్సార్ కడప జిల్లాలో మంగళవారం జరిగిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సదర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘‘దళితుల వెనుకబాటుకు ప్రధాన కారణమైన చదువుపైన సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.. అణిచివేతకు గురైన దళితులకు సమాజంలో సమానత్వం అందించేలా కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. దళితులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందిచడానికి కృషి చేస్తున్నారు అని తెలిపారు.
(చదవండి: సెలవు రోజూ ‘ఆసరా’ సంబరాలు)
‘‘సీఎం జగన్ దళితుల కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ప్రతిపక్షాలకు కడుపు మండుతోంది. అందుకే వాటిని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బడుగు వర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రయత్నం. దళితుల కుటుంబాల గుండెల్లో వైఎస్ జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారు. దళితులపైన చంద్రబాబుకు చులకన భావన, నీచ దృష్టి ఉంటుంది. అయితే దళితుల ఓట్లు మాత్రం కావాలనే నీచమైన ఆలోచనతో దళితులకు ద్రోహం చేశారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం దళితుల ఓటు బ్యాంకు కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దళితులంతా కలిసికట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అండగా నిలబడదాం’’ అని సురేశ్ పిలుపునిచ్చారు.
చదవండి: ‘ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’
Comments
Please login to add a commentAdd a comment