
సాక్షి, అమరావతి: దళితులపై జరుగుతున్న దాడుల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, చెబుతున్న నీతులు వంద గొడ్లను తిన్న రాబందు కాశీయాత్ర చేసినట్లు ఉందని ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో దళితులను అనేక రకాలుగా వేధించినప్పుడు కనీస చర్యలకు ఆదేశించని బాబు.. నేడు దళితుల పట్ల ఆవేదన చెందటం హాస్యాస్పదమేనన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► సొంత జిల్లా ముంగిలిపట్టులో ఓ దళిత వృద్ధ మహిళను చెప్పులతో కొట్టారు.
► శాంతిపురం (కుప్పం)లో మహిళను వివస్త్రను చేశారు.
► తొట్టంబేడులో ఓ మహిళను కొట్టి చంపారు.
► రాజుల కండ్రిగ, కృష్ణమనాయుడు కండ్రిగ, పశ్చికాపల్లిలో దళితులను వెలిపెట్టారు.
► రామాపురం (నెల్లూరు)లో 40 మంది దళితులను తప్పుడు కేసులతో జైలుకు పంపారు.
► టీడీపీ జెండా కాల్చారని చుండూరు దళిత యువకులను పోలీస్ స్టేషన్‌లో చావ బాదారు.
► దళితులైన నాయుడుపేట మునిసిపల్ చైర్‌పర్సన్ శోభారాణి, కడప జడ్‌పీ చైర్మన్ గూడూరు రవిలకు సమావేశాల్లో కుర్చీలు ఇవ్వకుండా నిలబెట్టారు.
► 6 వేల ప్రభుత్వ పాఠశాలలు, వందలాది ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు మూసేశావు.
Comments
Please login to add a commentAdd a comment