కుల వివక్షకు పెత్తందారుల ఆజ్యం!  | Inhuman attitude of TDP leaders in Chittoor district | Sakshi
Sakshi News home page

కుల వివక్షకు పెత్తందారుల ఆజ్యం! 

Published Sun, Jun 11 2023 4:32 AM | Last Updated on Sun, Jun 11 2023 4:32 AM

Inhuman attitude of TDP leaders in Chittoor district - Sakshi

నాగా వెంకటరెడ్డి – సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’’.. స్వయంగా చంద్రబాబు సందేహం ఇదీ!! ‘‘ఒరేయ్‌ మీకెందుకురా ఈ రాజకీయాలు? అవేవో మేం చేసుకుంటాం, మేం చూసుకుంటాం..!’’ ఎస్సీలనుద్దేశించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచిత వ్యాఖ్యలివీ! ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? టీడీపీ అధినేత ప్రోద్బలంతో ఆ పార్టీ నేతలు ఇప్పుడు అంతకంటే ఇంకో అడుగు ముందుకేశారు! దళిత ప్రజాప్రతిని ధులు తమ గ్రామాలకు వస్తుంటే చాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవడంతోపాటు పసుపు నీళ్లతో వీధులను శుభ్రం చేస్తున్నారు. అదీ ఎక్కడో కాదు.. స్వయంగా నారా చంద్రబాబు సొంతూరు ఉన్న మండలానికి చేరువలోనే కావడం గమనార్హం. 

పసుపు నీళ్లు చల్లుతూ...
చిత్తూరు జిల్లాలో అధికారపార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వస్తున్నట్లు తెలియగానే చంద్రబాబు సామాజిక వర్గీయులు తలుపులకు తాళా­లు వేసుకుని ఇళ్లలో నుంచి వెళ్లిపోవడం, ఇతరు­లు ఎవరూ అందుబాటులో ఉండకూడదని హుకుం జారీచేయడం, ఎమ్మెల్యేలు వెళ్లిపోయిన తరు­వాత రోడ్లపై పసుపు నీళ్లు చల్లడం, పాలతో అభిషేకాలు చేయించడం లాంటి దారుణాలకు ఒడి గ­డుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథ కాల గురించి ప్రజలకు నేరుగా వివరిస్తూ గడప గడ పకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

అందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు), పూతలపట్టు నియోజకవర్గాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కళ త్తూరు నారాయణస్వామి, ఎం.ఎస్‌.బాబు తమ తమ ప్రాంతాల్లో చురుగ్గా పర్యటిస్తున్నారు. దళిత ఎమ్మెల్యేలు వచ్చే సమయానికి అందరూ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవాలని, ఎవరూ స్వాగతం పలకరాదని, పర్యటనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలంటూ టీడీపీ అధినేత జారీ చేసిన ఆదేశాలను స్థానిక నాయకత్వం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంటికి తాళం.. పెరటిలో సర్పంచ్‌
ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు ఇటీవల పూతలపట్టు మండలం గుంతూరు గ్రామ సచివాలయం పరిధి­లోని 170 గొల్లపల్లె పర్యటనకు వెళ్లే సమయానికి టీడీపీ నాయకులు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వచ్చే సమయానికి ఎవరూ ఇళ్లలో ఉండకూడదని గ్రామ సర్పంచ్, టీడీపీ నాయకుడు ప్రకాష్‌నాయుడు హుకుం జారీచేయ­డంతో సుమా­రు వంద కుటుంబాలు గ్రామం వీడి వెళ్లక తప్ప­లేదు.

సర్పంచ్‌ తన ఇంటికి తాళం వేసి పెరట్లోనే ఉండటం గమనార్హం. గత నెల 24వతేదీన పేట అగ్రహారం గ్రామానికి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు వర్గం దారుణంగా వ్యవహరించింది. పంచాయతీ పరిధిలోని ఐదు గ్రామాల ప్రజ­లను బెది­రిస్తూ ఎవరైనా అందుబాటులో ఉంటే అంతు చూసా­్తమని హెచ్చరించారు. ఎమ్మెల్యే పర్య­టన అనంతరం వీధులను పసుపునీళ్లతో శుభ్రం చేయ­డం అగ్రకుల దురహంకారానికి మచ్చు తునక­గా నిలుస్తోంది.

దళిత నేతలకు దూరం దూరం...!
ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి గత నెల 24వతేదీన జీడీ నెల్లూరు మండలం పాచిగుంటలో గడప గడపకూ కార్యక్రమానికి వెళ్లిన సమ­యంలో టీడీపీ నాయకుడు మనోహర్‌నాయుడు స్థాని­కులను బెదిరింపులకు గురి చేయడం విస్మ­యం కలిగిస్తోంది. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోవా­లంటూ స్థానికులను హెచ్చరించారు. దళిత ఎమ్మెల్యేలను దరిచేరనివ్వకపోవడం, గ్రామాలకు రానివ్వకపోవడం చంద్రబాబు పెత్తందారీ మనస్త­త్వానికి తాజా నిదర్శనమని డిప్యూటీ సీఎం నారా­య­ణస్వామి పేర్కొన్నారు.

‘చంద్రబాబు, లోకేష్‌ డైరెక్షన్‌ మేరకే మనోహర్‌నాయుడు వ్యవహరిస్తు­న్నారు. పాచిగుంటలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 22 కుటుంబాలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయేలా ఒత్తిడి చేశారు. తాటిమాకులపల్లెలో 10 కుటుంబాల వారు కూడా అదేవిధంగా వెళ్లిపో­యారు. దళితులంటే చంద్రబాబుకు ఎందుకంత చులకన భావం?’ అని నారాయణస్వామి ప్రశ్నించారు. పూతలపట్టు, జీడీ నెల్లూరు చంద్రబాబు సొంత ఊరు ఉన్న మండలానికి చేరువలో ఉండటం గమనార్హం.


సమాజంలో తప్పుడు సంకేతాలు
రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు సహజం. దళిత ఎమ్మెల్యేలు గ్రామాల్లో కార్యక్రమాలు ముగించుకుని తిరిగి వెళ్లాక వీధులను పసుపు నీళ్లతో కడగడం, పాలాభిషేకాలు చేయడం దారుణం. దీనివల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టడమే కాకుండా సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి వాటిని అంగీకరించకూడదు.  – వందవాసి నాగరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి, తిరుపతి

ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలి..
ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంతటి అవమానకర వివక్ష దారుణం. వీధుల్లో పసుపునీళ్లు చల్లడం, ఇళ్లకు తాళాలు వేసుకుని బహిష్కరించడం, హేళనగా చూడటం ఏమాత్రం సరికాదు. ఇలాంటి దుర్మార్గాలకు కారకులఫై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వివక్షను నిర్మూలించాలి. ప్రజా సంఘాలు స్పందించి ప్రత్యక్ష కార్యాచరణకు నడుం బిగించాలి .  – ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement