చంద్రబాబువి క్షుద్ర రాజకీయాలు | K Narayanaswamy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబువి క్షుద్ర రాజకీయాలు

Published Mon, Jul 20 2020 5:24 AM | Last Updated on Mon, Jul 20 2020 5:24 AM

K Narayanaswamy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఎస్సీలను, దళిత సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.15,735 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనను చూసి ఓర్వలేని చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక కుల రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

► విశాఖపట్నంతో మొదలైన చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సాగుతున్నాయి. 
► మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎస్సీలకు సొంత డబ్బుతో పింఛన్లు ఇవ్వడంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దళిత వ్యతిరేకి అని విమర్శలు చేయడం దారుణం. 
► ఎస్సీల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు. ఇప్పటికీ ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో ఎస్సీలను దేవాలయాల్లోకి రానివ్వని పరిస్థితి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement