k narayana swamy
-
‘పవన్ కల్యాణ్.. అసలు నీది ఏ పార్టీ?’
సాక్షి, చిత్తూరు: వైఎస్ జగన్ పాలన రామరాజ్యం గనుకే.. మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అభిప్రాయపడ్డారు. గురువారం జిల్లాలోని ఎస్ఆర్ పురం మండలం ముద్దికుప్పం సచివాలయం ప్రారంభించిన ఆయన.. జగనన్న మళ్లీ ఎందుకు రావాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన హాట్ కామెంట్లు చేశారు. ‘‘తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తూ పవన్ కల్యాణ్.. ఏపీలోనేమో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అసలు నీది ఏ పార్టీ?, ఈ నాటకాలన్నీ ఎందుకు?’’ అని పవన్‌ను నారాయణస్వామి ప్రశ్నించారు. సినిమాల్లో నటించే పవన్.. ఎన్టీఆర్(మాజీ సీఎం), చిరంజీవిలాగా మాదిరిగా రాజకీయాల్లో రాలేదని, తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ, బీజేపీతో పొత్తు, ఏపీలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడని, అలాంటి మోసగాళ్లను నమ్మొద్దని’ ప్రజలను ఉద్దేశించి నారాయణస్వామి ప్రసంగించారు. సీఎం జగన్ పాలన రామరాజ్యం అని, చంద్రబాబుది రాక్షస రాజ్యం అని.. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఒకపక్క చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని, బీజేపీతో దత్తపుత్రుడు మరో పక్క పొత్తు పెట్టుకున్నారని నారాయణస్వామి చురకలంటించారు. -
ఎన్నికలప్పుడే పొత్తుల క్లారిటీ
సాక్షి, అమరావతి: రాజకీయ పార్టీల పొత్తులపై ఇప్పటికిప్పుడు స్పష్టత ఉండదని, ఎన్నికల సమయంలోనే వాటిపై క్లారిటీ వస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో అప్పటి కూటమి, రాజకీయ సమీకరణల ఆధారంగా పొత్తుల విషయంలో సీపీఐ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. విజయవాడలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ పాలనలో సామాన్యులే ఎక్కువగా ఇబ్బందులకు గురయ్యారని, కార్పొరేట్ వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. దేశంలో 14 మంది ప్రధానులు కలిసి రూ.40 లక్షల కోట్ల అప్పులు చేస్తే మోదీ ఒక్కరే రూ.80 లక్షల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. పెద్దనోట్ల రద్దుతో రూ.18 లక్షల కోట్ల బ్లాక్ మనీని మార్చుకున్నారని, 0.6 శాతం మాత్రమే మార్చకుండా వృధా అయిందని చెప్పారు. నోట్లరద్దు పేరుతో లక్షల కోట్ల రూపాయల నల్లధనం ఆరెస్సెస్, బీజేపీ ఖాతాల్లోకి చేరిందని ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్‌తో దేశానికి జరిగిన నష్టంపై జాతికి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, మోదీ విధానాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. -
పథకాల రద్దుకు ‘పచ్చ’ కుట్ర.. విషం కక్కుతున్న ఎల్లో బ్యాచ్
సాక్షి, అమరావతి: ‘సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై పక్కా ప్రణాళికతో కులనాగులు విషం కక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పదలచుకుందో ‘ఈనాడు’తో చెప్పిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ రద్దుచేయాలనే కుట్రకు చంద్రబాబు అండ్ కో బరితెగించారు. తమకు పొరపాటున ఎవరైనా ఓటువేస్తే రాష్ట్రంలో పేదలకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సర్వ మంగళం పాడాలన్న చంద్రబాబు కర్కశ మనస్తత్వాని ఈనాడు పత్రిక అద్దంపట్టింది. పేదలంటే వీరికి ఎంత కడుపుమంటో అర్థంమవుతోంది’.. అని ఉప ముఖ్యమంత్రి కె. నారాయణస్వామి, మంత్రులు మేరుగ నాగార్జున, గుడివాడ అమర్నాథ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఆపాలి’.. అంటూ ఈనాడులో వచ్చిన కథనంపై వీరు ముగ్గురూ మంగళవారం వేర్వేరుగా నిర్వహించిన మీడియా సమావేశాల్లో స్పందించారు. ‘ప్రభుత్వం ఏవో రెండు మూడు కార్యక్రమాలు అమలుచేస్తూ మిగిలిన వాటిని నిలిపివేస్తేనే మనకు మనుగడ ఉంటుంది’ అని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో చెప్పించి ఈనాడులో ప్రచురించడం దుర్మార్గమన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే.. ఆ ఐఏఎస్‌లు అప్పుడేం చేశారు? పేదలకు ఆగర్భ శత్రువుల్లా మాట్లాడటం దారుణం. తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలను రద్దుచేస్తాననే సంకేతాన్ని ‘ఈనాడు’ ద్వారా చంద్రబాబు ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నదంటూ మాజీ ఐఏఎస్‌లు మాట్లాడం దారుణం. ఈనాడులో రాసిన వార్తకు వంతపాడిన ఐఏఎస్ అధికారులిద్దరూ గత ప్రభుత్వ హయాంలో కీలక పదవుల్లో పనిచేశారు. అప్పుడు చంద్రబాబు పెద్దఎత్తున అప్పులు తెచ్చిన సొమ్మును దుర్వినియోగం చేస్తుంటే.. అలాగే, పోలవరం చూడటానికి, సింగపూర్ ఏజెన్సీకి, అమరావతి డిజైన్లకు చంద్రబాబు వందలాది కోట్లు దుబారా చేస్తుంటే వీరిరువురూ ఏంచేశారు? రాష్ట్రంలో పేదలందరూ బాగుండాలన్నది సీఎం వైఎస్ జగన్ ఆలోచనైతే.. టీడీపీ నేతలు మాత్రమే బాగుండాలన్నది చంద్రబాబు నైజం. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగలేదు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. సంక్షేమ పథకాలకు ఖర్చుచేసే సొమ్ములో సగం టీడీపీ నేతలకు, జన్మభూమి కమిటీల్లోని ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన జేబుల్లోకి చేరేవి. మంత్రివర్గంలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ అవకాశమిస్తే దానిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా చంద్రబాబును మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు తపనపడుతున్నారు. కానీ.. అది జరగని పని. మీ కుట్రలను ప్రజలు డేగకళ్లతో గమనిస్తున్నారు. వారు మళ్లీ కొట్టే దెబ్బకు చంద్రబాబు అండ్ కోకు కూసాలు కదలడం ఖాయం. పథకాలపై ఎల్లో బ్యాచ్ ఉద్దేశం ఇదా? ► అమ్మఒడి, చేయూత, వైఎస్సార్ ఆసరాను ఆపేయాలా? ► 52.4 లక్షల రైతు కుటుంబాలకు అందించిన వైఎస్సార్ ‘రైతుభరోసా’ను నిలిపేయాలా? ► 31 లక్షల కుటుంబాలకు లబ్ధిచేకూర్చే ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చెయ్యొద్దా? ► విద్యా దీవెన, వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా కానుకను అడ్డుకోవాలనేది వారి ఉద్దేశమా? ► జగనన్న గోరుముద్ద పథకానికి మంగళం పాడాలా? ► ఆసుపత్రులను చక్కగా తీర్చిదిద్దుతున్న నాడు–నేడు పథకాన్ని అటకెక్కించాలా? ► చంద్రబాబు మాదిరిగా రైతులకు సున్నావడ్డీ, పంటల బీమాను ఆపేయాలా? ► అలాగే, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఆపేయాలన్నది రామోజీరావు, చంద్రబాబు ఉద్దేశమా? ► వైఎస్సార్ పెన్షన్ కానుక కూడా ఇవ్వొద్దా? ► వైఎస్సార్ నేతన్న నేస్తం, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలను నిలిపివేయాలా? ► జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను ఏం చేయాలన్నది మీ ఉద్దేశ్యం? ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, ఆసరా వంటి గొప్ప పథకాలను అటకెక్కించాలా? ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని ఆపేయాలా? -
స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీకి శ్రీకారం
పెనుమూరు(చిత్తూరు): ఏపీలో రూ.50 కోట్లతో స్మార్ట్ డీవీ సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీకి గురువారం ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. నారాయణస్వామి మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలిస్తోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ, మెడికల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డీవీ గ్రూప్ కంపెనీ చైర్మన్ దీపక్‌కుమార్ తాల మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 3,000 మందికి ఉపాధి కల్పనే తమ కంపెనీ ఏర్పాటు వెనుక ముఖ్యోద్దేశమన్నారు. -
టీడీపీ మద్యపాన ఉద్యమం
సాక్షి, అమరావతి: విద్యార్థులు, రైతులు, నిరుపేదలు, ఇతర వర్గాల సమస్యలపై చాలా ఉద్యమాలు నడిచినా టీడీపీ మాత్రం మద్యపాన ఉద్యమాన్ని నడుపుతోందని ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి కె.నారాయణస్వామి వ్యాఖ్యానించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆయ న విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అమలు చేసున్న సంక్షేమ పథకాలపై విమర్శించడానికి ఆస్కారం లేకపోవడంతో మద్యం పై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మద్యం షాపులకు లైసెన్స్‌లు ఇచ్చి నిర్వహించాలని సలహా ఇచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్ మద్యనిషేధం అమలుచేస్తే చంద్రబాబు సీఎం కాగానే ఎత్తివేశారని చెప్పారు. మద్యనిషేధం అమలు చేసి పేదలకు రూ.2కే కిలో బియ్యం కూడా ఇస్తే అసెంబ్లీని మూసుకోవాల్సి వస్తుందని చంద్ర బాబు వ్యాఖ్యానించడం నిజంకాదా? అని ప్రశ్నిం చారు. మద్య నియంత్రణతో పేదలు బాగుపడటం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. లిక్కర్ మాఫియా వెనుక ఆయన హస్తం ఉందన్నారు. 63 శాతం తగ్గిన వినియోగం ప్రజల విజ్ఞప్తి మేరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బెల్టు షాపుల తొలగింపు ఫైల్‌పై సీఎం జగన్ సంతకం చేశారని మంత్రి నారాయణస్వామి చెప్పారు. దశలవారీ మద్య నియంత్రణ వల్ల 63 శాతం వినియోగం తగ్గిందన్నారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలుంటే వాటిని 2,934కి కుదించామన్నారు. 43 వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దుచేయడంతోపాటు 4,380 పర్మిట్ రూమ్‌లను కూడా రద్దుచేశామన్నారు. విక్రయాల వేళలను ఉదయం 11 రాత్రి 8 గంటలకు కుదించా మన్నారు. ఈ వ్యసనం నుంచి దూరం చేసేందుకు షాక్ కొట్టేలా ధరలను పెంచామన్నారు. ప్రస్తుతం ఉన్న మద్యం ఉత్పత్తి డిస్టిలరీలన్నీ టీడీపీ హయాంలో ఏర్పాటైనవేనని స్పష్టం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) ద్వారా మద్యం అక్రమాలను అరికడుతున్నామన్నారు. గత ఏడాది మే నుంచి ఇప్పటివరకు మద్యం అక్రమాల పై 1,14,689 కేసులను నమోదు చేసి 2,00,786 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. 51,103 వాహనాలను స్వాధీనం చేసుకుని 7,71,288 లీటర్ల నాటుసారా, 2,19,55,812 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన 7,12,557 లీటర్ల ఎన్డీపీఎల్, 95,238 లీటర్ల డ్యూటీ పెయిడ్ లిక్కర్, 2,49,162 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అభివృద్ధి పథంలో గంగాధర నెల్లూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. రోడ్లు వేయకముందు, ఆ తరువాత జరిగిన అభివృద్ధిని ఫోటోలతో వివరించారు. నాణ్యతలో రాజీ పడకుండా ప్రభుత్వం పనులు చేపడుతోందన్నారు. -
వాణిజ్యపన్నుల ఆదాయంలో 4వ స్థానం
సాక్షి, అమరావతి: కోవిడ్ కష్టకాలంలోను వాణిజ్యపన్నుల శాఖ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని, ఆదాయంలో దేశంలో 4వ స్థానంలో నిలిచిందని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో వాణిజ్యపన్నుల శాఖ రూ.55,935.13 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఆదాయం 2020–21లో రూ.44,178.51 కోట్లు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దశలవారీ మద్య నిషేధం చక్కటి ఫలితాలను ఇస్తోందని, దీనికి మద్యంపై తగ్గుతున్న వ్యాట్ ఆదాయమే నిదర్శనమని పేర్కొన్నారు. 2019–20లో రూ.10,403.84 కోట్లు ఉన్న మద్యంపై వ్యాట్ ఆదాయం 2020–21లో 41 శాతం తగ్గి రూ.6,161.43 కోట్లకు పరిమితమైందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ మార్చి వరకు జీఎస్టీ పాత బకాయిల వసూళ్లకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫలితాలను ఇచ్చిందని, ఈ డ్రైవ్ ద్వారా రూ.1,772 కోట్లు వసూలైందని వివరించారు. వాణిజ్యపన్నుల శాఖ ఉద్యోగులు, అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. కోవిడ్–19తో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మందగించినప్పటికీ సీఎం జగన్ పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఆటంకం రాకుండా చూస్తున్నారని తెలిపారు. వారి కుటుంబంలో సభ్యుడిగా ఆయా పథకాలను వారికి అందిస్తున్న సీఎం జగన్ పేదల పక్షపాతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. -
చంద్రబాబువి క్షుద్ర రాజకీయాలు
సాక్షి, అమరావతి: ఎస్సీలను, దళిత సంఘాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎస్సీల సంక్షేమానికి ప్రభుత్వం రూ.15,735 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనను చూసి ఓర్వలేని చంద్రబాబు ఏం చేయాలో అర్థం కాక కుల రాజకీయాలకు తెర తీశారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ► విశాఖపట్నంతో మొదలైన చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సాగుతున్నాయి. ► మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలో ఎస్సీలకు సొంత డబ్బుతో పింఛన్లు ఇవ్వడంతోపాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దళిత వ్యతిరేకి అని విమర్శలు చేయడం దారుణం. ► ఎస్సీల మధ్య చిచ్చు పెట్టిందే చంద్రబాబు. ఇప్పటికీ ఆయన సొంత ఊరు నారావారిపల్లెలో ఎస్సీలను దేవాలయాల్లోకి రానివ్వని పరిస్థితి ఉంది. -
పేదలకు దూరం చేయడానికే
వెదురుకుప్పం(చిత్తూరు జిల్లా): మద్య నిషేధంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసిందని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కళత్తూరు నారాయణస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర పెంచి, పేదలకు మద్యం దూరం చేయాలనే ఆలోచనతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వానికి రాబడి తగ్గిందనే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ధరలు పెంచడం ద్వారా విక్రయాలు తగ్గించి, ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు కానుకగా మద్య నిషేధం అమలు చేసి ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి, పరిష్కరిస్తుంటే, ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయన్నారు. మద్యం లేదనేది టీడీపీ వాళ్లే.. మద్యం విక్రయాలు ఆపడంతో సారా తయారు చేస్తున్నారనేది కూడా వారేనని ఎద్దేవా చేశారు. 80 శాతం బార్లు టీడీపీ హయాంలో వారికి అనుకూలమైనోళ్లకే అప్పజెప్పారని తెలిపారు. రాష్ట్రంలో సారా, నకిలీ మద్యం తయారీలో పట్టుబడింది టీడీపీ నేతలు, మద్దతుదారులేనన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తుంటే ఏదోరకంగా బురదజల్లి ప్రతిపక్ష నేత చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారన్నారు. దశలవారీ నిషేధమే సర్కారు లక్ష్యం: లక్ష్మణరెడ్డి సత్తెనపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ దృఢ సంకల్పమైన దశలవారీ మద్యనిషేధం అమలును ఎవరూ నీరుగార్చవద్దని మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి విజ్ఞప్తి చేశారు. దశలవారీ మద్యపాన నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంపూర్ణ మద్య నిషేధం అసాధ్యమని, నియంత్రించడమే మేలని సీపీఐ, సీపీఎం పేర్కొన్నాయని, ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అమలు చేయాలనడం హాస్యాస్పదమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర, నవరత్నాలు, ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్నట్లుగా దశల వారీ మద్య నిషేధాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నారన్నారు. మద్యం దుకాణాలు ఏటా 20 శాతం తగ్గిస్తూ, మద్యం విక్రయ సమయం కుదించినట్టు చెప్పారు. 2024 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యే పరిస్థితి ఉంటుందని, మరెక్కడా లభించదని స్పష్టం చేశారు. మద్యం అక్రమాలపై 14500, 180042454868 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. -
అక్రమాలకు పాల్పడితే పథకాల నిలిపివేత
సాక్షి, అమరావతి/తిరుపతి అన్నమయ్య సర్కిల్: మద్యం అక్రమాల్లో ప్రమేయమున్న వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి వెల్లడించారు. నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయిస్తామన్నారు.ఎక్సైజ్ అధికారులతో శనివారం ఆయన తిరుపతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్సైజ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామని అవసరమైతే ఉద్యోగం నుంచీ తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్ తనిఖీలు చేసి తేడాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నా మాటలు బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నా కరోనా మహమ్మారి బారి నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు, వారితో కలిసి మెలిగినవారు పరీక్షలు చేయించుకుని, అవసరమైతే వైద్యం చేయించుకోవాలని విజ్ఞప్తి చేశానని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ క్రమంలో తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు. -
సీఎం జగన్ ఉదారత.. దివ్యాంగుడికి ఆర్థిక సాయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు కాళ్లు, చేతులు లేని ఓ దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఆర్థిక సాయం చేశారు. అతన్ని ఆదుకునేందకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆ దివ్యాంగుడికి అందజేశారు. అనంతరం నారాయణస్వామి మాట్లాడుతూ.. లక్ష రూపాయల సాయం అడిగితే.. సీఎం రూ. 5లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. గొప్ప మానవతావాది ముఖ్యమంత్రిగా లభించడం పేదల అదృష్టం అని తెలిపారు. చదవండి : స్పందించిన సీఎం వైఎస్ జగన్ -
బాబూ..మీరు మళ్లీ ఎందుకు రావాలి?
సాక్షి, పుత్తూరు : ‘నేడు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి.. పల్లెలు పచ్చదనంతో పరిమళిస్తున్నా యి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో సహా గ్రామాల్లోని చెరువులు సైతం నిండుకుండలను తలపిస్తున్నాయి. రైతన్న కాడిని భుజానికెత్తుకుని సంతోషంగా పొలానికి వెళుతున్నాడు. ఐదేళ్ల మీ పాలనలో భూములు బీళ్లు వారాయి. కరువు రక్కసి కరాళనృత్యం చేసింది. తాగునీటికి అలమటించాల్సిన దుస్థితి ఏర్పడింది. సాగుకు నీరు లేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మళ్లీ మీరు రావాలని, కరువు కావాలని రాష్ట్ర ప్ర జలు కోరుకుంటున్నారా’ అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి ప్ర శ్నలు వర్షం కురిపించారు. మంగళవారం పు త్తూరులోని స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోమవారం శ్రీకాకుళంలో చంద్రబాబునాయుడు ‘మళ్లీ నేను రావాలని ప్రజలు కోరుకుంటున్నారు’ అని చేసిన వ్యా ఖ్యలపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. ‘ప్రతి రైతుకు రైతు భరోసా కింద రూ.13,500 ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారు.. రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి వంచించినందుకు ఏ రైతు అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుం టున్నారా.., అమ్మ ఒడి పథకం కింద పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేలు సీఎం వైఎస్ జగన్ అందించనున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యారంగాన్ని ధారాదత్తం చేసినందుకు ఏ విద్యార్థి తల్లిదండ్రులైనా మీరు మళ్లీ రావాలని అనుకుంటున్నారా.. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకారవేతనాలు మం జూరు చేయకుండా భవిష్యత్తుతో చెలగాటమాడినందుకు ఏ విద్యార్థి అయినా మళ్లీ మీరు రావాలని కోరుకుంటారా? అని ప్రశ్నిం చారు. రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కానుక ఇచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు దిశగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ప్రతి మహిళ మోములో చిరునవ్వు చూస్తున్నారు. మద్యం వ్యాపారం పేరుతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు దుకాణాలను నడపడమే కాకుండా గ్రామ గ్రామానా, వీధుల్లో, సందుల్లో సైతం బెల్టు దుకా ణాలు ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసినందుకు ఏ మహిళ అయినా మీరు మళ్లీ రావాలని కోరుకుంటున్నారా.. రాష్ట్రంలో ఉండే ప్రతి పేద కుటుంబానికి రా నున్న ఉగాది పండుగ రోజు ఇంటి పట్టాలు పం పిణీకి ముఖ్యమంత్రి సర్వం సిద్ధం చేస్తున్నారు. మీ హయాంలో ఒకటిన్నర సెంటు భూమి పేదవాడికి ఇచ్చేందుకు మనసు రాని మీరు మళ్లీ రావాలని ఏ నిరుపేద అయినా అనుకుం టారా..?, స్విమ్స్‌లో మెడికల్ షాపులు మొదలు పోలవరం, రాజధాని, విశాఖ భూకుంభకోణం వరకు, ఆఖరుకు టీటీడీలో డ్రైక్లీనింగ్ దుకాణం వరకు రాష్ట్ర సంపదను బంధువర్గానికి, అస్మదీయులకు దోచి పెట్టినందుకు మళ్లీ మీరు రా వాలని ప్రజలు ఎందుకు కోరుకుంటున్నారో సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబునాయుడుకు నారాయణస్వామి సవాలు విసిరారు. -
ఇది చంద్రబాబు కడుపు మంట
పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, యువతకు ఉద్యోగాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? – టీడీపీకి ఉప ముఖ్యమంత్రుల ప్రశ్న సాక్షి, అమరావతి : చెరువులో చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడుతుందో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, కళత్తూరు నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాషలు మండిపడ్డారు. ప్రజా రంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై కరపత్రం విడుదల చేసి లేని పోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అర్ధంతరంగా పారిపోయి వచ్చిన తుగ్లక్ చంద్రబాబు అని, ఆయన ప్రకటించిన చార్జిషీటులో నిజాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అధికారం పోయిందన్న కడుపు మంట చంద్రబాబుకు ఎంత ఉందో వారి కరపత్రం చూస్తే తెలుస్తోందన్నారు. ‘నా ఇల్లు ముంచేశారు.. నేను కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు..’ అనే రెండు మాటలే మూడు నెలలుగా చంద్రబాబు నోట వెలువడుతున్నాయన్నారు. టీడీపీ కరపత్రం మొదట్లోనే అక్రమ కట్టడాన్ని కూల్చిన ఫొటో వేశారని వారు తప్పు పట్టారు. అందులోని అంశాల వారీగా స్పందిస్తూ శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా శ్రీశైలం, నాగా ర్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండలేదన్న నిజాన్ని కరపత్రంలో ఇవ్వకుండా దాచారని తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులకు జగన్ ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ లంచాల కోసం చంద్రబాబు విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.20 వేల కోట్లు నష్టం తీసుకు వచ్చాడన్న విషయాన్ని మీడియా ఎందుకు రాయడం లేదని వారు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని స్పష్టీకరించారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా? అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా? చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్ టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా? 2014 జూన్ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది? రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా? మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా? అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా? ఉప ముఖ్యమంత్రుల ప్రతికా ప్రకటన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
130 సీట్లతో వైఎస్సార్సీపీ విజయం ఖాయం
వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 120 నుంచి 130 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని విజయభేరి మోగించనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి స్పష్టం చేశారు. వెదురుకుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారిన ప్రజలు తమ అభిమానాన్ని వైఎస్ జగన్‌కు ఓట్ల రూపంలో చూపించారని చెప్పారు. త్వరలో రాజన్నరాజ్యం రాబోతోందని, ఐదేళ్లుగా అవస్థలు పడ్డ ప్రజలకు మంచి పాలన అందించేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని తేల్చి చెప్పారు. ఆంధ్ర ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ టీడీపీ బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు సర్వేలతో టీడీపీకి వంత పాడుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. చంద్రగిరిలో రీపోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల కోడ్ నిబంధనలను ఖాతరు చేయకుండా టీడీపీకి అనుకూలంగా చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. కేవలం తన సామాజిక వర్గానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నట్లు మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ లగడపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను ఓట్లు వేయకుండా అడ్డుకుంటారా? చంద్రబాబు తన సొంత ఇలాకాలో దళితులను స్వేచ్ఛగా ఓట్లు వేయకుండా అడ్డుకోవడం విచారకరమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం పెత్తనంతో ఎస్సీ, ఎస్టీలు ఓటు హక్కుకు దూరమైనట్లు చెప్పారు. నేటికీ ఇలాంటి దుస్థితి నెలకొనడంపై బాబు సిగ్గుతో తలదించుకోవాలని సూచించారు. ఇన్నేళ్లుగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీలపై పెత్తనాన్ని చెలాయించినట్లు చెప్పారు. -
ఎస్సీ ఎమ్మెల్యే అంటే చిన్నచూపా?
సునీల్ కేసును పట్టించుకోకపోవడం దారుణం కేసు నమోదు చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి వెల్లడి తిరుపతి మంగళం/ శ్రీరంగరాజపురం /తిరుపతి రూరల్/ మదనపల్లె సిటీ/: పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వారని అధికారులు, టీడీపీ నాయకులు చిన్నచూపు చూస్తారా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ప్రశ్నించారు. శనివారం ఆయన ఫోన్లో విలేకరితో మాట్లాడారు. ఐరాల మండల సమావేశానికి సునీల్ హాజరైనా, సమావేశం నిర్వహించకుండా టీడీపీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ గిరినాయుడు రాలేదని సుమారు మూడు గంటలసేపు ఎమ్మెల్యేను నిరీక్షింపజేశారని, ఆ తర్వాత వచ్చిన గిరినాయుడు ఎమ్మెల్యేపై దురుసుగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారని ఆందోళన వ్యక్తం చేశారు. గిరినాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డీఎస్పీకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వెంటనే గిరినాయుడుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శ్రీరంగరాజపురంలో అక్రమంగా కేసులు శ్రీరంగరాజపురం మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యుడు విజయ్‌కుమార్‌కు చాంబరే లేదు, ఆయన కుర్చీ విరిచారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు 17 మందిపై కేసులుపెట్టడం ఎంతవరకు న్యాయమని ఎమ్మెల్యే నారాయణస్వామి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. శనివారం ఆయన శ్రీరంగరాజపురంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. విజయ్‌కుమార్ ఆస్తులు ధ్వంసం చేశారా? ఆయనపై దౌర్జన్యం చేశారా? ఎవరి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు? కేసులు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చిన వ్యక్తి ఎవ్వరు తేల్చాలని స్టేషన్లో బైఠాయించారు. నిందితులను వెంటనే అరెస్టుచేయాలి - ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను అవమానించిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల సమావేశంలో తనపై గిరినాయుడు, బాలసుబ్రమణ్యం నాయుడు దాడికి యత్నించి. కులం పేరుతో దూషించారని సునీల్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార వ్యక్తులను వేదికపై కూర్చోపెట్టి ఎమ్మెల్యేని దూషించడానికి కారణమైన ఎంపీడీవోను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే హక్కులకు భంగం కలిగించిన వారిపై అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అసెంబ్లీలో ప్రస్తావిస్తాం : ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ను దుర్భాషలాడిన టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మదనపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐరాల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ప్రజాప్రతినిధికి ఇచ్చే గౌరవం అదేనా ? అని ప్రశ్నించారు. పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించండి సారూ ! తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ వినతిపత్రం ఎమ్మెల్యే సునీల్‌ను కులం పేరుతో దూషించిన నిందితులను శిక్షించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు డిమాండ్ చేశారు. దళితులకు న్యాయం చేసేలా పోలీసులకు మంచి బుద్ధి ప్రసాదించు అంటూ శనివారం వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ ఎదుట ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పోలీసులు ఇప్పటికైనా నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చే సి, వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు స్పందించకుంటే దళిత సంఘా ల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించా రు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారపు వాసు, అధికార ప్రతినిధి చాట్ల భానుప్రకాష్, హరిబాబు, సిద్దారెడ్డి, సునీల్, రామస్వామి, లోకనాథం పాల్గొన్నారు. -
ప్రజాసేవకే జీవితం అంకితం
వెదురుకుప్పం, న్యూస్‌లైన్: ప్రజాసేవకే తన జీవితం అంకితమని వైఎస్సార్ సీపీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కే.నారాయణస్వామి స్పష్టం చేశారు. మండలంలోని గంటావారిపల్లె గ్రామానికి చెందిన పారి శ్రామికవేత్త బండి హేమసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జక్కదన గ్రామం నుంచి గంటావారిపల్లె, అగ్గిచేనుపల్లె, నల్లవెంగనపల్లె, పాతగుంట, వెదురుకుప్పం, పెరుమాళ్లపల్లె, చవనపల్లె, తిరుమలయ్యపల్లె, మొరవ, కొండకిందపల్లె, వావిల్చేను, దేవరగుడిపల్లె, తెల్లగుండ్లపల్లె, ఆళ్లమడుగు, ఎనమలమంద గ్రా మం వరకు రోడ్‌షో నిర్వహించారు. భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టారు. వెదురుకుప్పంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజ ల కోసం కష్టపడి పనిచేయాలన్న తపనతోనే రాజకీయాల్లో ఉన్నానని, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని, అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నిబద్దత ఉన్న పార్టీ అని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణం జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. హైదరాబాద్ తరహాలో సీమాంధ్ర రాజధానిని నిర్మించగల సత్తా జగన్‌కే ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు దోచుకున్న ప్రజాధనాన్ని సింగపూర్‌లో ఉంచుకుని ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు.