ప్రజాసేవకే జీవితం అంకితం | sacrifice my life to public service | Sakshi
Sakshi News home page

ప్రజాసేవకే జీవితం అంకితం

Published Mon, May 5 2014 3:20 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

ప్రజాసేవకే జీవితం అంకితం - Sakshi

ప్రజాసేవకే జీవితం అంకితం

 వెదురుకుప్పం, న్యూస్‌లైన్: ప్రజాసేవకే తన జీవితం అంకితమని వైఎస్సార్ సీపీ జీడీనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కే.నారాయణస్వామి స్పష్టం చేశారు. మండలంలోని గంటావారిపల్లె గ్రామానికి చెందిన పారి శ్రామికవేత్త బండి హేమసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జక్కదన గ్రామం నుంచి గంటావారిపల్లె, అగ్గిచేనుపల్లె, నల్లవెంగనపల్లె, పాతగుంట, వెదురుకుప్పం, పెరుమాళ్లపల్లె, చవనపల్లె, తిరుమలయ్యపల్లె, మొరవ, కొండకిందపల్లె, వావిల్‌చేను, దేవరగుడిపల్లె, తెల్లగుండ్లపల్లె, ఆళ్లమడుగు, ఎనమలమంద గ్రా మం వరకు రోడ్‌షో నిర్వహించారు.

 భారీ స్కూటర్ ర్యాలీ చేపట్టారు. వెదురుకుప్పంలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ ప్రజ ల కోసం కష్టపడి పనిచేయాలన్న తపనతోనే రాజకీయాల్లో ఉన్నానని, పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని, అయితే వైఎస్సార్ కాంగ్రెస్ నిబద్దత ఉన్న పార్టీ అని చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. సీమాంధ్ర పునర్నిర్మాణం జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. హైదరాబాద్ తరహాలో సీమాంధ్ర రాజధానిని నిర్మించగల సత్తా జగన్‌కే ఉందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. ర్యాలీలో పాల్గొన్న చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు దోచుకున్న ప్రజాధనాన్ని సింగపూర్‌లో ఉంచుకుని ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేశారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement