వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
సాక్షి, అమరావతి/తిరుపతి అన్నమయ్య సర్కిల్: మద్యం అక్రమాల్లో ప్రమేయమున్న వారికి ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి వెల్లడించారు. నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టే వారిపై పీడీ యాక్టులు నమోదు చేయిస్తామన్నారు.ఎక్సైజ్ అధికారులతో శనివారం ఆయన తిరుపతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్సైజ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడితే సస్పెండ్ చేస్తామని అవసరమైతే ఉద్యోగం నుంచీ తొలగిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని బార్లు, మద్యం షాపుల్లో స్టాక్ తనిఖీలు చేసి తేడాలుంటే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నా మాటలు బాధించి ఉంటే క్షమాపణ కోరుతున్నా
కరోనా మహమ్మారి బారి నుంచి అందరూ బయటపడాలనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్లి వచ్చినవారు, వారితో కలిసి మెలిగినవారు పరీక్షలు చేయించుకుని, అవసరమైతే వైద్యం చేయించుకోవాలని విజ్ఞప్తి చేశానని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ క్రమంలో తన మాటలు ఏవైనా బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment