
మాట్లాడుతున్న నారాయణస్వామి, చిత్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి
పెనుమూరు(చిత్తూరు): ఏపీలో రూ.50 కోట్లతో స్మార్ట్ డీవీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం కొత్తపల్లె పంచాయతీ కొటార్లపల్లె వద్ద ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీకి గురువారం ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణస్వామి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానందరెడ్డితో కలిసి భూమి పూజ చేశారు.
నారాయణస్వామి మాట్లాడుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డప్పలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం రాయితీలిస్తోందని తెలిపారు. చిత్తూరు జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ, మెడికల్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డీవీ గ్రూప్ కంపెనీ చైర్మన్ దీపక్‌కుమార్ తాల మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 3,000 మందికి ఉపాధి కల్పనే తమ కంపెనీ ఏర్పాటు వెనుక ముఖ్యోద్దేశమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment