
సాక్షి, కాకినాడ : సీఎం చంద్రబాబు నాయుడికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ప్రతి ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ఏపీ నుంచి మహారాష్ట్రకు దళితుల కోసం ఉచితంగా ప్రత్యేక రైళ్ళు నడపాలని ఆయన కోరారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పుట్టిన గ్రామమైన మహారాష్ట్రలోని మౌహంను జయంతి సందర్భంగా వారు దర్శించుకుంటారు. అంతేకాక ప్రతి జిల్లా నుంచి కనీసం 30 బోగిలు ఉన్న రైళ్ళను ప్రభుత్వమే తన సొంత ఖర్చుతో నడపాలని ముద్రగడ అన్నారు.
రాజధాని అమరావతిలో స్మృతివనం ఏర్పాటు చేయాలని మీ కడుపు నుంచి కాకపోయినా.. పెదాల నుంచి వచ్చినందుకు సంతోషమని ముద్రగడ అన్నారు. గత కొద్ది రోజులగా స్మృతివనం ఏర్పాటు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment