![jackpot for woman who showed middle finger to Donald Trump - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/16/Juli-Briskman.jpg.webp?itok=P0h-vAP_)
వాషింగ్టన్ : జూలీ బ్రిస్క్‌మాన్.. అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు.. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యవేలు చూపించి తన అసహనాన్ని ప్రకటించిన మహిళ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వస్తుంది. రెండువారాల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వర్జీనియాలో గోల్ఫ్ ఆడి తిరిగి వెళుతున్న సమయంలో జూలీ.. ఆయన కాన్వాయ్‌ని వెంబడించి మరీ మధ్య వేలు చూపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జూలీని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆమెకు ఉపాధి లేకుండా పోయింది. దీంతో ఆమెకు ఆర్థిక అవసరాల నిర్వహణ కోసం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న అకిమా.. సామాజిక మాధ్యమాల ద్వారా క్రౌడ్ ఫండింగ్‌ను సేకరించడం మొదలు పెట్టారు.
ట్రంప్‌కు జూలీ మధ్యవేలు చూపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం..అదే సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో నెటిజన్లకు జూలీ మీద అభిమానం పొంగింది. దీంతో కేవలం 7 రోజుల్లోనే 70 వేల డాలర్ల ఫండ్ సమకూరాయి. ఈ మొత్తాన్ని కేవలం 3 వేల మంది దాతలు అందించడం విశేషం. క్రౌడ్ ఫండింగ్ ద్వారా లక్ష డాలర్లు సేకరించి ఆమెకు అందిస్తున్నట్లు అకిమా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment