ఒకరిని ప్రేమించి.. మరొకరితో నిశ్చితార్థం
ఒకరిని ప్రేమించి.. మరొకరితో నిశ్చితార్థం
Published Thu, Mar 31 2016 3:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి
నల్లగొండ క్రైం : తనను ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకున్నాడని ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం ఆ యువకుడిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పీఏ మండలానికి చెందిన ధర్మాపురం ముత్యాలు, వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కాలనీకి చెందిన స్నేహ స్థానిక వీటీ కాలనీలోని వెన్నెల స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో 2008-2011లో జీఎన్‌ఎం విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు.
కాగా మమాబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రబాద్ మండలం పధిర గ్రామానికి చెందిన సరితతో ఈ నెల 30న వివాహం కోసం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందులోభాగంగా రూ. 3 లక్షల నగదు, 7 తులాల బంగారం, బైకును కట్నంగా మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలిసిన స్నేహ యువకుడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ.. కేసు విచారణ చేయూలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన టూటౌన్ ఎస్‌ఐ దుర్గాప్రసాద్ యువకుడు ముత్యాలును అదుపులోకి తీసుకోవడంతో పాటు సరిత కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే సరిత కుటుంబం హైరాబాద్‌లోని నాగోల్ పరిధిలో బండ్ల గూడెంలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడే ఉంటున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా బండ్ల గూడెంలోనే చేశారు. సరిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్మాపురం ముత్యాలును నిలదీయడంతో కట్నంగా ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. స్నేహను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.
Advertisement
Advertisement