School of Nursing
-
నర్సింగ్ విద్యార్థినులకు అస్వస్థత
– కలుషిత ఆహారమే కారణం – రుయా అత్యవసర విభాగంలో వైద్య సేవలు తిరుపతి మెడికల్ : రుయాలోని స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా పదిమంది జీఎన్ఎం నర్సింగ్ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ ఆఫ్ నర్సింగ్ కళాశాలకు చెందిన 67 మంది విద్యార్థినులు రుయాలోని ‘ప్యూపిల్ నర్సస్ హాస్టల్’లో ఉన్నారు. విద్యార్థినులే కమిటీగా ఏర్పడి ఓ వంట మాస్టర్‌ను ఏర్పాటు చేసుకుని భోజనాలు తయారు చేయించుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం చికెన్ తెప్పించుకుని చేయించారు. చికెన్ తినని విద్యార్థినులు కేక్, ఐస్‌క్రీం తెప్పించుకున్నారు. రాత్రి కూడా అవే తిన్నారు. ఉదయం లేచే సరికి పది మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలయ్యాయి. తోటి విద్యార్థులు వారిని రుయా అత్యవసర విభాగానికి తరలించారు. సాయంత్రం సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ ఆర్.ఆర్.రెడ్డి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి హాస్టల్‌ను తనిఖీ చేశారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ప్రిన్సిపల్ రష్యారాణి, అధ్యాపకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్దానాయక్ సాయంత్రం విద్యార్థినులను పరామర్శించారు. ప్రమాదం తప్పిందని తెలిపారు. -
ఒకరిని ప్రేమించి.. మరొకరితో నిశ్చితార్థం
ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువతి నల్లగొండ క్రైం : తనను ప్రేమించి మోసం చేసి మరో అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకున్నాడని ఓ యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో బుధవారం ఆ యువకుడిని టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పీఏ మండలానికి చెందిన ధర్మాపురం ముత్యాలు, వరంగల్ జిల్లా కేంద్రంలోని శివనగర్ కాలనీకి చెందిన స్నేహ స్థానిక వీటీ కాలనీలోని వెన్నెల స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో 2008-2011లో జీఎన్ఎం విద్యనభ్యసించారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కాగా మమాబూబ్‌నగర్ జిల్లాలోని అమ్రబాద్ మండలం పధిర గ్రామానికి చెందిన సరితతో ఈ నెల 30న వివాహం కోసం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇందులోభాగంగా రూ. 3 లక్షల నగదు, 7 తులాల బంగారం, బైకును కట్నంగా మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలిసిన స్నేహ యువకుడిపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది. స్పందించిన ఎస్పీ.. కేసు విచారణ చేయూలని టూటౌన్ పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన టూటౌన్ ఎస్ఐ దుర్గాప్రసాద్ యువకుడు ముత్యాలును అదుపులోకి తీసుకోవడంతో పాటు సరిత కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అందించారు. అయితే సరిత కుటుంబం హైరాబాద్లోని నాగోల్ పరిధిలో బండ్ల గూడెంలో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడే ఉంటున్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా బండ్ల గూడెంలోనే చేశారు. సరిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్మాపురం ముత్యాలును నిలదీయడంతో కట్నంగా ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. స్నేహను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.