
సాక్షి, వరంగల్ : ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటిముందు ఆందోళన చేపట్టింది. మాయమాటలతో తనను లోబర్చుకుని గర్భం దాల్చడానికి కారకుడయ్యాడని, న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. సద్దాం అనే యువకుడు అదే గ్రామానికి చెందిన అప్సరా అనే యువతిని ప్రేమ పేరుతో మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. అతని ఇంటిముందు ఆందోళన చేస్తున్న యువతికి ఎమ్మార్పీఎస్ నాయకులు, గ్రామం సర్పంచ్ యశోద తదితరులు మద్దతుగా నిలిచారు.
అయితే, యువతిని ఇష్టపడిన మాట వాస్తవమేనని, ఆమెను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పానని సద్దాం వెల్లడించాడు. అప్సరా వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నేను డీఎన్‌ఏ టెస్టుకు సిద్దం. నా వల్లనే ఆమె గర్భం దాల్చిందని రుజువైతే.. ఏ శిక్షకైనా రెడీ. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. కానీ, ఆమె వేరేవారి మాయమాటల్లో పడి ఆందోళన చేస్తోంది’ అన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment