శ్రీకాకుళం క్రైమ్: సంతబొమ్మాళి మండలం పిట్టవానిపేటకు చెందిన యువకుడు తనను ప్రేమించానని చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశా డని విజయవాడకు చెందిన ప్రత్తిపాటి క్రిష్టినా ఏంజిల్ ఆరోపించారు. ఆమె మంగళవారం శ్రీకాకుళంలోని ఓ హొటల్‌లో మీడియాతో మాట్లాడారు. పిట్టవానిపేటకు చెందిన శాంతికుమార్, తన సోదరుడు రూఫిన్ బెంగళూరులో బైబిల్ కాలేజీలో శిక్షణ తీసుకున్నారని, ఆ సమయంలోనే తనతో శాంతికుమార్ పరిచయం పెంచుకున్నాడని తెలిపారు. ఆ తర్వాత శాంతికుమార్ తన ప్రేమను వ్యక్తం చేశాడని, తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడించాడని చెప్పారు.
తాను కూడా పెళ్లికి ఒప్పుకున్నానని, ఆ తర్వాత శారీరకంగా కూడా ఇద్దరం ఒక్కటయ్యామ ని తెలిపారు. ఏప్రిల్‌లో అతను తనకు రింగు కూడా తొడిగాడని, ఆ తర్వాత ముఖం చాటేశాడని, ఏప్రిల్ 28 నుంచి కుటుంబ సభ్యులంతా తన ఫోన్ నంబర్ బ్లాక్ చేశారని పేర్కొన్నారు. వేరే సంబంధం కుదరడంతో తనను వదిలేశారని, దీంతో జూన్‌లో శాంతికుమార్ ఇంటికి వెళ్లి మరీ బతిమలాడానని, అయి నా ఒప్పుకోకపోవడంతో విజయవాడ దిశ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అప్పట్లో పలాస తెలుగుదేశం పార్టీ నాయకుడు, అచ్చెన్నాయుడు అనుచరుడు బో సుబాబుతో తనను బెదిరించారన్నారు.
ఈ విష యంపై బోసుబాబుతో పాటు శాంతికుమార్ ఆయ న తండ్రిపై కూడా తాను విజయవాడ పడమట స్టేషన్‌లో కేసు పెట్టానని చెప్పారు. రెండు కేసులు పెట్టడంతో శాంతికుమార్ కుటుంబ సభ్యులు తనపై సంతబొమ్మాళి పీఎస్‌లో కేసు పెట్టారని, టెక్కలి డీఎస్పీ విచారణకు రావాలంటే సోమవారం విచారణకు హాజరై తన వద్ద ఉన్న ఆధారాలు అన్నీ సమర్పించానని చెప్పారు. శాంతికుమార్ తనను పెళ్లి చేసుకునే వరకు వదిలి పెట్టబోనని, అతని ఇంటి ముందు మౌన పోరాటం చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు సహకరించి తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment