
నిందితుడికి పోలీస్‌స్టేషన్‌లో రాచమర్యాదలు!
రణస్థలం: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు స్వగ్రామం బంటుపల్లిలో ఎనిమిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన నారు ప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి సోమవారం జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. బాధిత బాలిక బంటుపల్లి ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. చిన్నతనం, అమాయకత్వం వల్ల విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద దర్యాప్తు చేయగా.. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా.. అక్కడ రాచమర్యాదలు జరిగినట్లు సమాచారం.
కాగా, ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు స్వగ్రామంలోనే ఇటువంటి దారుణం జరగడం సంచలనంగా మారింది. నిందితుడు ప్రసాద్ బంటుపల్లి పంచాయతీలోని యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో తిరుమరెడ్డి సతీష్ అనే కాంట్రాక్టర్ వద్ద ఎన్.ఎం.ఆర్‌గా పనిచేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే వీరిద్దరూ యూబీ పరిశ్రమ లో పాగా వేశారు. ఎమ్మెల్యేకు ప్రసాద్ వీరవిధేయుడుగా మెలగడంతోనే పరిశ్రమలో ఉద్యోగం వేయించారని గ్రామస్తులు గుసగుసలాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment