
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని కేశవరాయునిపాలేం గ్రామానికి చెందిన నాయన భవానీ (20) గడ్డి మందు తాగేసిన సంగతి తెలిసిందే. ఈమె భర్త నాయని చంటి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. భర్త మరణంతో కుంగిపోయిన ఆమె ఆదివారం ఉదయం గడ్డి మందు తాగేయడంతో రిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మృతి చెందారు. లావేరు హెచ్‌సీ పి.రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.