తుని రూరల్ : తనను ప్రేమించానని నమ్మించి ఓ వ్యక్తి మోసగించాడని తేటగుంట గ్రామానికి చెందిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఓ బాలిక తేటగుంట గ్రామంలోని పి.గాంధీ అనే వ్యక్తి ఇంట్లో ఉంటోంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన కె.శ్రీను బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించానని నమ్మించి, ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా, తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ శ్రీను ఆమెకు చెప్పాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలికను తుని ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఆయన వివరించారు.
ప్రేమించి మోసగించాడంటూ బాలిక ఫిర్యాదు
Published Sun, Jul 5 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement
Advertisement