Girl complaint
-
బాలికపై స్నేహితుల అత్యాచారం
థానే: స్నేహితుల దినోత్సవం పేరు చెప్పి ఓ బాలికను పార్టీకి ఆహ్వానించిన ఇద్దరు స్నేహితులు..ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. స్నేహితుల రోజు వేడుకను చేసుకుందాం రమ్మని ఆదివారం సాయంత్రం బాలిక(16) వద్దకు ఆమె ఇద్దరు స్నేహితులు వచ్చారు. తెలిసినవారు కావటంతో ఆమె వారి వెంట వెళ్లింది. తర్వాత నిందితులిద్దరూ బాలికను బైక్ డోమ్బివ్లీలోని ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి రేప్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించిన నిందితులు..ఆమెను ఇంటి వద్ద దింపారు. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు విద్యార్థి కాగా, మరొకరు చేపల వ్యాపారం చేస్తున్నాడు. -
ఉద్యోగం ముసుగులో యువతికి వేధింపులు
సాక్షి, విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతులకు గాలం వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రబుద్ధుడి బాగోతం వెలుగుచూసింది. శ్రీకాకుళానికి చెందిన గుమ్మడి రిషికేశ్వరావు విజయవాడలో భారత్ అనే కంపెనీని నిర్వహిస్తూ ఉపాధి పేరుతో యువతులను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో రిషికేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ రిషికేశ్వరరావు ఇదే రకంగా యువతులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదులున్నాయి. నిరుద్యోగ యువతులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళలు ఆయనపై గతంలో భవానీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ప్రేమించి మోసగించాడంటూ బాలిక ఫిర్యాదు
తుని రూరల్ : తనను ప్రేమించానని నమ్మించి ఓ వ్యక్తి మోసగించాడని తేటగుంట గ్రామానికి చెందిన బాలిక పోలీసులను ఆశ్రయించింది. రూరల్ ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం..తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఓ బాలిక తేటగుంట గ్రామంలోని పి.గాంధీ అనే వ్యక్తి ఇంట్లో ఉంటోంది. ఇటీవల అదే గ్రామానికి చెందిన కె.శ్రీను బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమించానని నమ్మించి, ఆమెను లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక కోరగా, తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ శ్రీను ఆమెకు చెప్పాడు. దీంతో ఆ బాలిక పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. బాలికను తుని ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్టు ఎస్సై అశోక్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఆయన వివరించారు.