
సాక్షి, విజయవాడ : ఏపీ రాజధాని ప్రాంతంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతులకు గాలం వేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రబుద్ధుడి బాగోతం వెలుగుచూసింది. శ్రీకాకుళానికి చెందిన గుమ్మడి రిషికేశ్వరావు విజయవాడలో భారత్ అనే కంపెనీని నిర్వహిస్తూ ఉపాధి పేరుతో యువతులను ప్రలోభాలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో రిషికేశ్వరరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గతంలోనూ రిషికేశ్వరరావు ఇదే రకంగా యువతులతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఫిర్యాదులున్నాయి. నిరుద్యోగ యువతులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగం పేరుతో వారిని లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత మహిళలు ఆయనపై గతంలో భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment