వరలక్ష్మి(ఫైల్)
ఆనందపురం (భీమిలి): విశాఖ జిల్లా ఆనందపురం మండలం పందలపాకలో మంగళవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పందలపాకలో నివసిస్తున్న యర్ర రాము, యర్ర కామమ్మలకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె కొన్నేళ్ల క్రితం మృతి చెందగా రెండో కుమార్తె వరలక్ష్మి (20) తల్లిదండ్రులతో ఉంటోంది. వీరి ఇంటికి ఎదురుగా నివసిస్తున్న నరసింగరావు మూడేళ్లుగా వరలక్ష్మి వెంటబడి ప్రేమిస్తున్నానని నమ్మించాడు. షికార్లకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించాడు. రెండేళ్ల నుంచి పెళ్లి ప్రస్తావన తెస్తున్నా పలకడంలేదు. పెద్దల వద్ద పలుమార్లు పంచాయితీ జరిగింది. ఎట్టకేలకు నరసింగరావు పెళ్లికి అంగీకరించడంతో 2017 అక్టోబర్ 7న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది.
కట్నం కింద రూ.2 లక్షలిచ్చారు. నెలలు గడుస్తున్న పెళ్లి ప్రస్తావన తేకపోవడంతో మంగళవారం నరసింగరావు తల్లిదండ్రులు సూరి, లక్ష్మి వద్దకు వరలక్ష్మి తల్లిదండ్రులు వెళ్లి పెళ్లి ప్రస్తావన తేగానే కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని కుమార్తె వరలక్ష్మికి తెలపడంతో ఆమె వెళ్లి నరసింగరావును నిలదీసింది. మరో రూ.5 లక్షలిస్తేగానీ పెళ్లి చేసుకోనని ఆయన తెగేసిచెప్పడంతో వరలక్ష్మి మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment