వెల్మజాల (గుండాల) : ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు..పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు.. ఆపై లొంగదీసుకుని గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోవాలని కోరితే కులం తక్కువదానివంటూ నిందించాడు.. ప్రేమకు గుర్తుగా ఆ బాలిక ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.. తనకు న్యాయం చేయాలని కోరుతూ మహిళా సంఘాలతో కలిసి ప్రియుడి ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగిoది.
వివరాలు.. మండలంలోని వెల్మజాల గ్రామానికి చెందిన కోల పెంటయ్య చిన్న కొడుకు కోల సతీష్ గ్రామంలోనే జులాయిగా తిరుగుతుండేవాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. పర్యవసానంగా ఆ బాలిక గర్భం దాల్చింది. రోజురోజుకీ తన శరీరంలో వస్తున్న మార్పులను గుర్తించలేకపోయింది. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రి కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం గమనార్హం.
కడుపునొప్పిరావడంతో..
ఇటీవల ఆ బాలికకు కడుపునొప్పి లేవడంతో తల్లిదండ్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు బాలిక గర్భవతి అని తేల్చిచెప్పారు. ఈ నెల 7వ తేదీన ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
మహిళా సంఘాలతో కలిసి ఆందోళన
మహిళా సంఘాల బాధ్యులతో కలిసి ఆ బాలిక బుధవారం ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అయి తే విషయం తెలుసుకుని సతీష్ కుటుంబ సభ్యులు ఇంటి నుంచి పరారయ్యారు. బాధితురాలికి తగిన న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని మహిళా సంఘాల సభ్యులు హెచ్చరించారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి..
Published Thu, May 19 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 12:23 AM
Advertisement
Advertisement