ప్రియుడి మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! | techie commits suicide as lover cheated | Sakshi

ప్రియుడి మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!

Dec 31 2014 12:07 PM | Updated on Sep 2 2017 7:02 PM

మీర్పేట ప్రాంతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. రాఘవి అనే యువతి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది.

మీర్పేట ప్రాంతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. రాఘవి అనే యువతి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడు సుశీల్ కుమార్ తనను మోసం చేశాడనే ఆవేదనతోనే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రాఘవి మీర్పేట ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవారు.

ఆమె సుశీల్ కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించేసరికి.. అతగాడి అసలు స్వరూపం బయటపడింది. కోటి రూపాయల కట్నం ఇవ్వాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశాడు. దాంతో ఇన్నాళ్లూ ప్రేమించి, ఇప్పుడిలా అంటున్నాడని తీవ్ర మనస్తాపానికి గురైన రాఘవి.. ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement