techie suicide
-
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే మనస్తాపంతో ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పొగాకు హరిణి(24) అనే యువతికి రెండున్నరేళ్ల క్రితం గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో బస చేస్తూ.. మాదాపూర్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్తుండేది. కాగా తను పనిచేస్తున్న సంస్థతో ఉన్న రెండున్నర ఏళ్ల ఒప్పందం డిసెంబరు నెలతో ముగియనుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో తాను ఉంటున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ అని సమాచారం. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం ఆత్మహత్య
ఇండోర్: సంతోషంగా, సజావుగా సాగుతున్న వారి కుటుంబ జీవన ప్రయాణం ఒక్క సారిగా తలకిందులైంది. ఇంటి యజమాని ఉద్యోగం పోవడంతో పాటు అప్పటివరకు దాచుకున్న డబ్బంతా బిజినెస్‌లో నష్టపోవడంతో ఆ కుటుంబానికి ఏం చేయాలో దిక్కుతోచలేదు. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకరమైన ఘటన ఇండోర్‌లో చేటుచేసుకుంది. ఈ ఘటనలో అభిషేక్ సక్సేనా(45), ప్రీతి సక్సేనా(42) వీరి కవల పిల్లలు అద్విత్(14), అనన్య(14)లు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇండోర్‌కు చెందిన అభిషేక్ సక్సేనా కుటుంబం ఓ రిసార్ట్‌లో విగతజీవులుగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు వీరికి సంబంధించిన విషయాలను దర్యాప్తులో భాగంగా తెలుసుకున్నారు. అభిషేక్ సక్సేనా ఉద్యోగం పోవడం, కుటుంబ పోషణ భారంగా మారడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వచ్చిన అభిషేక్ స్థానిక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అయితే గత కొద్ది నెలల క్రితం ఉద్యోగం పోవడం, ఇప్పటివరకు ఆన్లైన్లో పెట్టిన పెట్టుబడులు నష్టాలు వాటిల్లడంతో అభిషేక్ ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారింది. మరోవైపు పిల్లల ఎదుగుదల, పోషణ, వారి చదువులు అభిషేక్‌కు భారంగా మారాయి. దీంతో అభిషేక్ తన 82 ఏళ్ల తల్లిని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంచి కుటుంబ సభ్యులంతా కలిసి బుధవారం రిసార్ట్‌కు వెళ్లారు. అయితే రెండు రోజులైన వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తమ దగ్గరున్న మాస్టర్ కీతో డోర్స్ ఓపెన్ చేసి చూడగా నలుగురు కుటుంబ సభ్యులు జీవచ్ఛవాలుగా పడివున్నారు. దీంతో రిస్టార్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నానమ్మతో అద్విత్, అనన్య (ఫైల్ ఫోటో) సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ విషం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాటిల్ ఆన్లైన్లో కొన్నట్లు వారి దర్యాప్తులో తేలింది. నలుగురు కావాలనే బలవన్మరణానికి పాల్పడ్డారా లేక తల్లిదండ్రులే మొదట పిల్లలకు విషమిచ్చి అనంతరం వారు తీసుకున్నారా లేక భార్య, పిల్లలను మొదట హత్య చేసి అనంతరం అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు.. కొన్ని మెయిల్స్ కూడా పరిశీలించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు మరణించడంతో 82 ఏళ్ల అభిషేక్ సక్సేనా తల్లి కన్నీరుమున్నీరవుతోంది. -
నెట్లో చూసి.. నొప్పిలేకుండా టెకీ ఆత్మహత్య
ఇంటర్నెట్.. రెండువైపులా పదునున్న కత్తి. దాన్ని విజ్ఞానానికీ వాడొచ్చు, వినాశనానికీ వాడొచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దాన్ని ఏకంగా ఆత్మహత్యల కోసం కూడా వాడేస్తున్నారు. ఢిల్లీలో ఉండే ఓ పాతికేళ్ల వెబ్ ఇంజనీర్.. ఆన్లైన్లో కార్బన్ మోనాక్సైడ్ తెప్పించుకుని, దాన్ని పీల్చి ఏమాత్రం నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్రీయ పరిశోధన కోసం తనకు కార్బన్ మోనాక్సైడ్ కావాలని చెప్పి చిన్న సిలిండర్ తెప్పించుకున్న అతడు.. ఓ పెద్ద పాలిథిన్ కవర్ తీసుకుని, అందులో తన ముఖంతో పాటు సిలిండర్‌ను కూడా కలిపి పెట్టుకుని, కింద మొత్తం గట్టిగా మూసేశాడు. అప్పటికే సిలిండర్ వాల్వు తెరిచి ఉంచడంతో అందులోంచి వచ్చిన గ్యాస్ పీల్చి.. నొప్పి తెలియకుండా తక్కువ సమయంలోనే ప్రాణాలు వదిలేశాడు. అనుకోకుండా కార్బన్ మోనాక్సైడ్ పీల్చి చనిపో్వడం సాధారణమేనని, కానీ.. ఇలా కావాలనే ఆ వాయువుతో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం అధిపతి ప్రొఫెసర్ సుధీర్ గుప్తా తెలిపారు. అతడు నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకునే విధానాల కోసం ఇంటర్నెట్ గాలించినట్లు కూడా ఆ తర్వాత తెలిసింది. అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లోని బాత్రూంలో అతడి శవం పడి ఉండటాన్ని పోలీసులు గమనించారు. ఆ వాయువు ఎలా చంపుతుంది కార్బన్ మోనాక్సైడ్ మనుషులను ఎలా చంపుతుందన్న విషయాన్ని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యుడు డాక్టర్ చిత్తరంజన్ బెహరా వివరించారు. ''వాసన, రంగు లేని.. ఏమాత్రం శారీరక ఇబ్బంది కలిగించని వాయువు. ఇది ఆక్సిజన్ కన్నా 200 రెట్లు ఎక్కువగా రక్తంలోని హెమోగ్లోబిన్‌తో కలిసిపోతుంది. రక్తంలోని ఆక్సిజన్ బదులు మొత్తం ఇది వ్యాపించి, చివరకు మెదడుకు కూడా ఆక్సిజన్ అందకుండాపోయి.. వెంటనే మరణం సంభవిస్తుంది. తక్కువ స్థలంలో ఎక్కువ గాఢతతో ఈ వాయువు వ్యాపిస్తే.. చాలా తక్కువ సమయంలోనే ప్రాణం పోతుంది. ఈ కేసులో ఇలాగే జరిగింది'' అని ఆయన తెలిపారు. -
ప్రియుడి మోసం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య!
మీర్‌పేట ప్రాంతంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. రాఘవి అనే యువతి బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. తన ప్రియుడు సుశీల్ కుమార్ తనను మోసం చేశాడనే ఆవేదనతోనే ఆమె బలవంతంగా ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. రాఘవి మీర్‌పేట ప్రాంతంలోని ఓ హాస్టల్లో ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. ఆమె సుశీల్ కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించేసరికి.. అతగాడి అసలు స్వరూపం బయటపడింది. కోటి రూపాయల కట్నం ఇవ్వాలని సుశీల్ కుమార్ డిమాండ్ చేశాడు. దాంతో ఇన్నాళ్లూ ప్రేమించి, ఇప్పుడిలా అంటున్నాడని తీవ్ర మనస్తాపానికి గురైన రాఘవి.. ఆత్మహత్య చేసుకుంది.