సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం కోల్పోతాననే మనస్తాపంతో ఓ టెకీ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రాయదుర్గం పోలీసు స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. పొగాకు హరిణి(24) అనే యువతికి రెండున్నరేళ్ల క్రితం గోల్డెన్ హిల్స్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో గచ్చిబౌలిలోని ఓ హాస్టల్‌లో బస చేస్తూ.. మాదాపూర్‌లో ఉన్న ఆఫీసుకు వెళ్తుండేది. కాగా తను పనిచేస్తున్న సంస్థతో ఉన్న రెండున్నర ఏళ్ల ఒప్పందం డిసెంబరు నెలతో ముగియనుండటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైంది. ఈ క్రమంలో తాను ఉంటున్న హాస్టల్ గదిలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ అని సమాచారం.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
Published Wed, Nov 20 2019 12:47 PM | Last Updated on Wed, Nov 20 2019 7:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment