- వివాహిద దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం
- పోలీసులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం
- డీఎస్పీ జోక్యంతో సద్దుమణిగిన ఆందోళన
దామెర లో పరిస్థితులు ఉద్రిక్తం
Published Thu, Sep 22 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM
దామెర(ఎల్కతుర్తి): తనకు న్యాయం చేయాలని మండలంలోని దామెరలో ఐత స్వర్ణలత అనే వివాహిత ప్రియుడి ఇంటి ఎదుట చేపట్టిన మౌనదీక్ష గురువారం రెండో రోజుకు చేరింది. వంగర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని స్వర్ణలతను పోలీసు వాహనంలో తరలించడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. గ్రామస్తులంతా ఏకమై అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లారని పోలీసులను నిలదీశారు. విషయం తెలపకపోవడంతో వర్షంలోనే ఆందోళనకు దిగారు. బాధితురాలి తండ్రి ఐత సంపత్ క్రిమిసంహారక మందు తాగగా..108లో ఆస్పత్రికి తరలించారు. ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న హుజూరాబాద్ రూరల్ సీఐ గౌస్‌బాబా సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ, సైదాపూర్ ఎస్సై శ్రీధర్‌ను పంచాయితీ కార్యాలయంలోనే చుట్టుముట్టి స్వర్ణలతను తీసుకురావాలని డిమాండ్ చేశారు. రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అనంతరం స్వర్ణలతను గ్రామానికి తీసుకొచ్చారు. ప్రియుడు పాటి ప్రవీన్‌తో స్వర్ణలత వివాహం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ రవీందర్‌రెడ్డి వచ్చి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Advertisement