మహిళా టెకీ మృతి.. శరీరమంతా గాయాలు
కోల్‌కతా: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న మహిళ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె ఒంటి నిండా తీవ్ర గాయాలయ్యాయి. పుణెలోని దేహు రోడ్డులో ఆమె మృతదేహం పడి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాకు చెందిన అంతార దాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.