
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్‌లో స్రవంతి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవి కిరణ్ కూడా సాప్ట్‌వేర్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment