
నిందితుడు హరీష్‌కుమార్ ,మృతురాలు విజయలక్ష్మి(ఫైల్)
కృష్ణరాజపురం : సంపాదన విషయంలో చోటు చేసుకున్న గొడవలోనే ఢిల్లీకి చెందిన మహిళా టెక్కీ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు నిందితుడిని గురువారం వైట్‌ఫీల్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరక వివరాలు...‘ఢిల్లీకి చెందిన విజయలక్ష్మీ(24) అక్కడ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో రోజూ ఇంటికి సమీపంలోని జిమ్‌కు వెళ్లేది. ఈక్రమంలో అక్కడ పనిచేస్తున్న హరిష్‌కుమార్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా రూపాంతరం చెందింది.
ఇంజినీరింగ్ ముగిసిన అనంతరం విజయలక్ష్మికి బెంగళూరులో ఓ బహుళజాతి సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం లభించింది. దీంతో ఆమె కొద్ది కాలం క్రితం బెంగళూరు వచ్చారు. విజయలక్ష్మీని కలుసుకోవడానికి ఈనెల19వ తేదీన హరిష్‌కుమార్ కూడా బెంగళూరు వచ్చాడు. మాటల సందర్భంలో వేతనాల విషయం ప్రస్తావనకు వచ్చింది. నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నానని, నీకెందుకు భయపడాలంటూ విజయలక్ష్మి వాదించింది. కోపోద్రిక్తుడైన హరిశ్‌కుమార్ కాలితో బలంగా తన్నాడు. కిందపడిపోయిన విజయలక్ష్మీ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు’. అని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment