నా భర్త నపుంసకుడు.. న్యాయం చేయండి!
పోలీసులకు మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఫిర్యాదు
బనశంకరి: పోలీసుల ముందుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఆ తగవును ఎలా పరిష్కరించాలా? అని వారే తర్జనభర్జనలు పడుతున్నారు. ‘నా భర్త నపుంసకుడని మొదటిరాత్రే తేలిపోయింది, నాకు న్యాయం చేయండి’ అని ఒక మహిళా టెక్కీ శనివారం హలసూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో పేరుపొందిన సాఫ్ట్‌వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
నిజం తెలిశాక ఇల్లొదిలిపోయాడు
కానీ పెళ్లైన రోజు నుంచి భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతూ ఉన్నట్లు ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని సవాల్ విసిరారు. ఆరునెలల కిందట తాను పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే నిజం బహిర్గతమైందని, ఆ క్షణం నుంచి వదిలివెళ్లిపోయాడని తెలిపారు. వివాహమైన రోజు నుంచి భర్త తనతో కాపురం చేయలేదని ఆమె ఆరోపించారు. ఇంట్లో తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఆమె భర్తను వెతికితెచ్చి తదుపరి ‘దర్యాప్తు’ చేయడంలో నిమగ్నమయ్యారు.