woman software engineer
-
మాదాపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : నిత్యం జన సంచారం ఉండే మాదాపూర్ ప్రాంతం అది. ఓ ఐటీ మహిళా ఉద్యోగిని నడుచుకుంటూ అదే రహదారిపై తాను పనిచేసే కంపెనీకి వెళుతున్నారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి ఆమె మెడపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే నిందితుడి చొక్కా పట్టుకొని గట్టిగా నిలదీయడంతో దాడికి యత్నించాడు. అయినా ఆమె భయపడలేదు. ధైర్యంగా ఎదురు దాడి చేసింది. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సికింద్రాబాద్ వారాసిగూడలో నివాసముంటున్న ఓ మహిళ మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నాలుగు నెలల గర్భిణి అయిన ఆమె రోజూ మాదిరిగానే గురువారం రాత్రి 8 గంటలకు విధులకు వచ్చారు. అనంతరం రాత్రి తొమ్మిది గంటల సమయంలో భర్త తన కంపెనీ వద్దకు రావడంతో ఇద్దరూ కలిసి భోజనం చేసేందుకు సమీపంలోని వైఎస్సార్ చౌరస్తాకు వెళ్లారు. భోజనం అనంతరం భర్త ఇంటికి వెళ్లిపోగా ఆమె ఫోన్లో మాట్లాడుతూ నడుచుకుంటూ సమీపంలో ఉన్న కంపెనీకి బయల్దేరారు. ఇంతలో ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆమె మెడపై చేయి వేసి అసభ్యకరంగా తాకాడు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆమె తలపైకి ఎత్తి చూడగా అతను అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనించారు. వెంటనే అతడిని వెంబడించి నిలదీసింది. సమాధానం చెప్పకుండా నిందితుడు ఆమెపై దాడికి దిగాడు. ఆమె ఏ మాత్రం భయపడకుండా.. అతడిపై ఎదురు దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. అనంతరం గట్టిగా కేకలు వేయడంతో చుట్టటుపక్కల వారు గమనించి అతడిని పట్టుకున్నారు. వెంటనే బాధితురాలు 100కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. -
వేధింపులు తట్టుకోలేక మహిళా టెక్కీ ఆత్మహత్య
సాక్షి, కర్ణాటక(బనశంకరి) : కష్టసుఖాల్లో కలకాలం తోడుంటానని తాళికట్టిన భర్తే తన శీలాన్ని శంకించడంతో భార్య మనసు విరిగిపోయింది. ఇటువంటి అనుమానపు పిశాచితో కాపురం చేయలేనని ఏకంగా ప్రాణాలే తీసుకుంది. వివాహేతర సంబంధం ఉందని భర్త నిత్యం అనుమానిస్తుండడంతో ఆవేదన చెందిన మహిళా ఐటీ ఇంజినీరు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చెన్నమ్మకెరె అచ్చుకట్టుపోలీస్‌స్టేషన్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు... భువనేశ్వరినగరలో విజయ్‌కిరణ్, తులసి (30) అనే దంపతులు నివాసముంటున్నారు. తులసి నగరంలోని విప్రో కంపెనీలో టెక్కీగా పనిచేస్తోంది. విజయ్‌కిరణ్ నిత్యం భార్య ప్రవర్తన పట్ల అనుమానం వ్యక్తం చేసేవాడు. ఈ విషయంలో భార్యభర్తలిద్దరూ పలుమార్లు గొడవపడ్డారు. ఆదివారం రాత్రి కూడా ఇదే మాదిరి గలాటా పడ్డారు. భర్త ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన తులసి ఇంట్లో తన గదిలోకి వెళ్లి గడియ వేసుకుని ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. విజయ్‌కిరణ్ గది తలుపు బద్దలు కొట్టి తులసిని కిందికి దించి స్ధానిక యోగానంద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఆమెను పరిశీలించి మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడి
సాక్షి, బెంగళూరు : గోవధను అడ్డుకున్నందుకు బెంగళూరులో ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. మాకే అడ్డుపడతావా అంటూ సుమారు 150మంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, విచక్షణారహితంగా కొట్టి ...కారును ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని నందిని తల, కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. దాడి నుంచి తేరుకున్న ఆమె...ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.....కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కాగా నగర శివారులోని తలఘట్టపుర పరిధిలోని టిప్పు సర్కిల్ కసాయిఖానా వద్ద సాగే గోవధను అడ్డుకునేందుకు తాను ఇద్దరు కానిస్టేబుల్స్‌తో కలిసి అక్కడకు వెళ్లినట్లు నందిని తెలిపారు. అయితే అప్పటికే అక్కడ పెద్ద గుంపు ఉందని, ఒక్కసారిగా వారంతా తమపై విరుచుకుపడ్డారన్నారు. దీంతో తనతో వచ్చిన కానిస్టేబుల్స్ అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. మరోవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై దాడిని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఖండించారు. బెంగళూరులో శాంతిభద్రతలు క్షీణించాయనటానికి ఇదో ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ దాడి సంఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ... చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. The incident clearly exposes once again the deteriorated law and order in the state. https://t.co/NlBaGx5iUk — B.S. Yeddyurappa (@BSYBJP) 15 October 2017 మహిళను కొట్టి కారును ధ్వంసం చేసిన వీడియో -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
నొయిడా: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నొయిడాలోని 62వ సెక్టార్లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. పాట్నాకు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటోంది. ఆమె గత రెండేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో వారిద్దరు శారీరకంగా కలవడం వల్ల గర్భం దాల్చింది. అయితే ప్రేమించిన యువకుడు తనను కాదని మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో మనస్తాపానికి గురై యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
నా భర్త నపుంసకుడు.. న్యాయం చేయండి!
పోలీసులకు మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదు బనశంకరి: పోలీసుల ముందుకు ఒక విచిత్రమైన కేసు వచ్చింది. ఆ తగవును ఎలా పరిష్కరించాలా? అని వారే తర్జనభర్జనలు పడుతున్నారు. ‘నా భర్త నపుంసకుడని మొదటిరాత్రే తేలిపోయింది, నాకు న్యాయం చేయండి’ అని ఒక మహిళా టెక్కీ శనివారం హలసూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బెంగళూరులో పేరుపొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐటీ ఇంజనీర్లు 2011లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నిజం తెలిశాక ఇల్లొదిలిపోయాడు కానీ పెళ్లైన రోజు నుంచి భర్త కునాల్ శ్యామ్ ప్రతి రాత్రి తనను దూరం పెడుతూ ఉన్నట్లు ఆమె తన గోడు వెళ్లబోసుకున్నారు. ఒకవేళ తన భర్త సంతానభాగ్యం కల్పిస్తే తన ఫ్లాట్‌ను అతడి పేరుతో రాసిస్తానని సవాల్ విసిరారు. ఆరునెలల కిందట తాను పదే పదే నిలదీయడంతో నపుంసకుడనే నిజం బహిర్గతమైందని, ఆ క్షణం నుంచి వదిలివెళ్లిపోయాడని తెలిపారు. వివాహమైన రోజు నుంచి భర్త తనతో కాపురం చేయలేదని ఆమె ఆరోపించారు. ఇంట్లో తన అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఆమె భర్తను వెతికితెచ్చి తదుపరి ‘దర్యాప్తు’ చేయడంలో నిమగ్నమయ్యారు.