మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
Published Thu, Aug 10 2017 12:39 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM
నొయిడా: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు. ఇప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నొయిడాలోని 62వ సెక్టార్‌లో బుధవారం రాత్రి వెలుగుచూసింది. పాట్నాకు చెందిన ఓ యువతి ప్రైవేట్ కంపెనీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటోంది. ఆమె గత రెండేళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో వారిద్దరు శారీరకంగా కలవడం వల్ల గర్భం దాల్చింది.
అయితే ప్రేమించిన యువకుడు తనను కాదని మరో యువతిని పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో మనస్తాపానికి గురై యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement